Twitter CEO: అకౌంట్‌ను నిషేధించడంపై గర్వంగా లేదు.. ట్రంప్‌ అకౌంట్‌ బ్యాన్‌పై తొలిసారి స్పందించిన ట్విట్టర్‌ సీఈఓ..

Twitter CEO Reacts On Trump: అమెరికాలో అధికార మార్పిడి జరగుతోన్న వేళ జరుగుతోన్న గందరగోళం అంతా ఇంత కాదు. ఇప్పటికే ట్రంప్‌ వ్యవహారశైలిపై...

Twitter CEO: అకౌంట్‌ను నిషేధించడంపై గర్వంగా లేదు.. ట్రంప్‌ అకౌంట్‌ బ్యాన్‌పై తొలిసారి స్పందించిన ట్విట్టర్‌ సీఈఓ..
Follow us

|

Updated on: Jan 15, 2021 | 12:08 AM

Twitter CEO Reacts On Trump: అమెరికాలో అధికార మార్పిడి జరగుతోన్న వేళ జరుగుతోన్న గందరగోళం అంతా ఇంత కాదు. ఇప్పటికే ట్రంప్‌ వ్యవహారశైలిపై విమర్శలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా క్యాపిటల్‌ భవన్‌లో జరిగిన హింసాత్మక సంఘటనలకు ట్రంప్‌ సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌లే కారణమంటూ ట్విట్టర్‌ నుంచి మొదలు పెడితే యూట్యూబ్‌ వరకు అతని అకౌంట్‌లను నిషేధించాయి. ఇదిలా ఉంటే ట్రంప్‌ అకౌంట్‌ను నిషేధించడంపై ట్విట్టర్‌ సీఈఓ జాక్‌ డోర్సీ తొలిసారి స్పందించారు. ట్రంప్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ బ్యాన్‌ చేయడానికి గల కారణాన్ని ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. ట్రంప్‌ అకౌంట్‌పై నిషేధం విధించడం పట్ల తాము గర్వంగా లేమని, సంబరాలు కూడా చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఎన్నో హెచ్చరికల తర్వాతే ట్రంప్‌ అకౌంట్‌ను బ్యాన్‌ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ట్విట్టర్‌ తీసుకున్నది సరైన నిర్ణయమే.. ప్రజల భద్రతపైనే దృష్టిసారించేలా మేము అసాధారణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. నిషేధం విధించడం నిజానికి ఒక వైఫల్యమేనని తమ ప్లాట్‌ఫామ్‌పై ఆరోగ్యకరమైన చర్చ జరపడంలో తాము విఫలమయ్యామని జాక్‌ డోర్సీ అంగీకరించారు. ఇక ఆన్‌లైన్‌ స్పీచ్‌ వల్ల ఆఫ్‌లైన్‌లో హింస జరిగిందన్నది నిజమేమని ట్విట్టర్‌ సీఈఓ అభిప్రాయపడ్డారు.

Also Read: Man lost Bitcoin Password : ఓ చిన్న పాస్ వర్డ్ అతని జీవితాన్నే మార్చేసింది.. ఏకంగా ఎన్ని కోట్లు కోల్పోయాడో తెలుసా..!