పిచ్చికి నిలువుటద్దమా? సంస్కరణలకు మారుపేరా? తుగ్లక్ : ఓ ఇంటరెస్టింగ్ హిస్టరీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి.. మూడురాజధానుల ప్రతిపాదన తెచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు తుగ్లక్. టీడీపీ, జనసేన, బీజేపీ లాంటి పార్టీలు ఎక్కువగా ఇది తుగ్లక్ నిర్ణయం అంటూ జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడే కాదు ప్రధాని నరేంద్రమోడీ భారతదేశంలో పెద్దనోట్లను రద్దుచేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పెద్దలు, కమ్యూనిస్టులు, తృణమూల్ కాంగ్రెస్ సహా దేశంలో ఎంతోమంది ఇది తుగ్లక్ నిర్ణయం అంటూ తప్పుబట్టారు. అప్పుడు […]

పిచ్చికి నిలువుటద్దమా? సంస్కరణలకు మారుపేరా? తుగ్లక్ : ఓ ఇంటరెస్టింగ్ హిస్టరీ
Follow us

|

Updated on: Jan 25, 2020 | 12:47 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి.. మూడురాజధానుల ప్రతిపాదన తెచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు తుగ్లక్. టీడీపీ, జనసేన, బీజేపీ లాంటి పార్టీలు ఎక్కువగా ఇది తుగ్లక్ నిర్ణయం అంటూ జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడే కాదు ప్రధాని నరేంద్రమోడీ భారతదేశంలో పెద్దనోట్లను రద్దుచేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పెద్దలు, కమ్యూనిస్టులు, తృణమూల్ కాంగ్రెస్ సహా దేశంలో ఎంతోమంది ఇది తుగ్లక్ నిర్ణయం అంటూ తప్పుబట్టారు. అప్పుడు మోడీ నిర్ణయాన్ని ఇప్పుడు జగన్ ప్రతిపాదనను రెండింటినీ తుగ్లక్ తో పోల్చారు. అయితే మహ్మద్ బీన్ తుగ్లక్‌కి నరేంద్రమోడీ, జగన్‌ తీసుకున్న నిర్ణయాలకు సంబంధం ఏముంది అని ఆరా తీస్తే రాజధాని మార్చడం ఒక్కటే కనిపిస్తోంది.

అయితే ఇప్పుడు జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తేవడానికి అప్పుడు తుగ్లక్ రాజధాని మార్చడం ఒక్కటేనా అంటే కాదనే చరిత్ర చెబుతోంది. అలాగే అప్పట్లో తుగ్లక్ దేశంలో నాణేలను మార్చడానికి మోడీ నోట్ల రద్దుకు సంబంధం ఉందా? పోనీ ఇప్పటి పాలకుల నిర్ణయాన్నితప్పు పడుతూ తుగ్లక్‌తో పోల్చి గేలి చేసేంత తప్పు తుగ్లక్ చేశాడా అని ఆరా తీస్తే ఎన్నెన్నో ఆసక్తికర అంశాలు తెలుస్తాయి. చరిత్ర మూలాల్లోకి వెళ్లి అసలు ఎవరీ తుగ్లక్ ..ఎందుకు ఆయన రాజధానిని మార్చారు..ఎందుకు నాణేలు మార్చాల్సి వచ్చింది. చరిత్రలో తుగ్లక్ ఎందుకు ఇప్పటికీ విమర్శలను ఎదుర్కుంటున్నాడు..?

చరిత్రదేముంది చింపేస్తే చిరిగిపోతుంది అంటాడు ఏదో తెలుగు సినిమాలో బ్రహ్మానందం.. చరిత్ర చింపేస్తే చిరిగిపోయేది కాదు..ఎవరికి కావాల్సివచ్చినట్టు వాళ్లు రాసుకుంటే సరిపోయేది కాదు.. అయితే చరిత్ర వక్రీకరణ కొన్నిసార్లు జరిగిపోతుంటుంది. ఓ పరిపాలకుడు చేసిన మంచి పరిపాలన కంటే ఆయన పాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు ప్రతికూల ఫలితాలిస్తే.. ఆ తర్వాత ఆ మంచి పనులు చేసిన పాలకుడు కూడా కాలం కలిసిరాక చరిత్రలో మచ్చగా మిగిలిపోతాడు.

అలాంటి వారిలో ఒకడే మహ్మద్ బిన్ తుగ్లక్…వాస్తవానికి మహ్మద్ బిన్ తుగ్లక్ ఎంతో తెలివైనవాడని చరిత్ర చెబుతోంది. తుగ్లక్ వంశస్తుల్లో అత్యంత కీలకమైనది మహ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలన..మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఢిల్లీసుల్తానుల పరిపాలన సువర్ణాక్షరాలతో లిఖించదగినదే.. క్రీస్తు శకం 1206 సం. నుంచి 1526 సం. వరకు ఢిల్లీ కేంద్రంగా ఐదు రాజవంశాలు పరిపాలిస్తే అందులో అత్యంత ముఖ్యమైంది తుగ్లక్ వంశం..1316 సం.లో మాలిక్ కపూర్ విషప్రయోగంతో అల్లావుద్దీన్ ఖిల్జీని చంపించడంతో ఖిల్జీ వంశం ముగిసిన తర్వాత తుగ్లక్ వంశ పరిపాలన ప్రారంభమైంది.

తుగ్లక్ వంశ పరిపాలకుడు ఘియాజుద్దీన్ తుగ్లక్.. అసలు పేరు ఘాజి మాలిక్.. తుగ్లకాబాద్‌ను రాజధానిగా చేసుకుని పరిపాలన ప్రారంభించాడు. ఇతని కుమారుడే మహ్మద్ బిన్ తుగ్లక్… తుగ్లక్ 1325 సం.నుంచి 1351 సం.వరకు ఢిల్లీ రాజధానిగా పాలించాడు.. తుగ్లక్ తండ్రి మరణం విషయంలోనూ చరిత్ర అతడినే నిందితుడు అని చెబుతోంది. తండ్రి ఘియాజుద్దీన్ తుగ్లక్‌ను తానే చంపించాడని ప్రచారం ఉంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని గోదావరి జిల్లాల్లో కాకతీయ ప్రతాప రుద్ర వంశుస్థులైన ముసునూరి ప్రోలయ్య భూపతి నాయడి చేతిలో ఘియాజుద్దీన్ హతమయ్యాడనేది తెలుగు చరిత్ర కారులు చెబుతున్నమాట.. ఎందుకంటే గోదావరి జిల్లాల్లో హిందూదేవాలయాలను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేస్తున్న ఘియాజుద్దీన్ తుగ్లక్‌పై అప్పటి ప్రోలయ్య భూపతి నాయుడు ఆధ్వర్యంలో 75 మంది సామంతులు ఏకమై గెరిల్లా యుద్ధం చేసి తుగ్లక్‌ను చంపేశారని చెబుతుంటారు. ఇది మరుగున పడిపోయి 1325 సం.లో బెంగాల్ దండయాత్ర నుంచి తిరిగి ఢిల్లీకి వస్తున్న తండ్రికి ఘన స్వాగతం ఏర్పాటు చేసి ఎత్తైన వేదికపై తండ్రిని కూర్చోబెట్టి ఆ వేదికను కూల్చే మహ్మద్ బిన్ తుగ్లక్ సుల్తాన్ అయ్యాడనేది మరో చరిత్ర చెబుతున్నమాట..ఇందులో ఏది నిజమో ఇంతవరకూ స్పష్టత లేదు కానీ తండ్రిమరణంలోనూ తుగ్లక్ చరిత్ర దుర్మార్గుడిగా మిగిలిపోయాడు..కానీ ముసునూరి వంశస్థులు మాత్రం అతన్ని మేమే చంపామని ఎంత మొత్తుకున్నా చరిత్ర పెద్దగా పట్టించుకోలేదు.

తుగ్లక్ అసలు పేరు జునాఖాన్.. మహ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ సుల్తానులందరిలోకి ఎక్కువ చదువుకున్నవాడు.. అనేక భాషలు నేర్చుకున్నవాడు.. ఆయన చేతిరాత ముత్యాలను తలపించేదని చరిత్ర చెబుతోంది. మంచి ఆలోచనాపరుడు, అంతే తెలివికలవాడు కూడా.. ఖజానా నిండడానికి అప్పట్లో గంగాయమునా అంతర్వేది ప్రాంతంలో భూమి శిస్తును పెంచాడు..మొదట్లో రైతులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ అదే సమయంలో కరవు రావడంతో శిస్తు కట్టలేక ప్రజలు నానా ఇబ్బందుల పడడంతో తుగ్లక్ నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ తర్వాత శిస్తు తగ్గించినప్పటికీ తుగ్లక్ ప్రజల మెప్పు పొందలేకపోయాడు..

రాజధాని దేశానికి మధ్యలో ఉంటే అందరికీ అందుబాటులో ఉంటుందని 1327 సం.లో ఢిల్లీకి 700కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవగిరికి మార్చాడు.. ఆ దేవగిరిపేరును దౌల్తాబాద్‌గా మార్చాడు.. అయితే ఆయన తనతో పాటు రాజధానిలో ఉన్న ప్రజలను కొత్త రాజధానికి రావాలని ఆదేశించాడు..అక్కడైతే అన్ని వనరులున్నాయి కాబట్టి ప్రజలు సంతోషంగా ఉంటారనేది తుగ్లక్ భావన..కానీ ఇలా దౌల్తాబాద్‌కు నడకమార్గంలో ప్రజలు వెళ్లే సమయంలో చాలామంది చనిపోయారు..అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం ప్రజలనుంచి తీవ్ర విమర్శలు ఎదురు కావడంతో తిరిగి దౌల్తాబాద్ నుంచి రాజధానిని పాత ఢిల్లీకి మార్చాడు.. విమర్శల నుంచి ఉపశమనానికి ప్రజల మన్నన పొందడానికి తీసుకున్న రెండో నిర్ణయం అతన్ని మరింత విమర్శల పాలు చేసింది. ఎంతలా అంటే ఇన్ని వందల ఏళ్లయినా సరే తుగ్లక్‌ను రాజధాని మార్పు విషయం చర్చించుకునేంత.. ఆయన పాలనలో దేశంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాడు..అయినా అవన్నీ మరుగున పడిపోయాయి. ఎన్నెన్నో పథకాలు ప్రారంభించాడు… కానీ రాజధాని మార్పు అంశమే అతని చరిత్రను మసకబారేలా చేసింది.

1329 సం.లో బంగారు, వెండినాణేలకు బదులు రాగినాణేలను అమల్లోకి తెచ్చాడు…బంగారం, వెండి విలువ తెలుసుకుని వాటిని ఖజానాలో ఉంచితే రాజ్యం మరింత సుభిక్షంగా ఉంటుందని బావించాడు.. రాగి నాణేలు అయితే ఎక్కువగా ప్రజలకు అందుబాటులోకి తేవొచ్చని తుగ్లక్ ఆలోచన..అందుకే ప్రజల చేతుల్లో చలామణిలో ఉన్న బంగారు నాణేలన్నింటినీ రాగినాణేలతో మార్చుకోవాలని ఆదేశాలు జారీ చేశాడు..కానీ అప్పట్లో రాజధాని మార్పుతో తుగ్లక్ పై కోపంతో ఉన్న ప్రజలు అతని నిర్ణయాన్నిపెద్దగా పట్టించుకోలేదు. తుగ్లక్ చెప్పినట్టుగా పాత బంగారు నాణేలు ఇచ్చి కొత్త రాగినాణేలు తీసుకోలేదు. అంతేగాదు తుగ్లక్ కొత్తగా రిలీజ్ చేసిన రాగినాణేలపై గుర్తులు చాలా తేలికగా ఉండడంతో యంత్రాలతో తామే అలాంటి రాగినాణేలను ముద్రించేసుకున్నారు. దీంతో తుగ్లక్ ఖజనాలో రాగినాణేలు టన్నులు టన్నులుగాను.. గుట్టలు గుట్టలుగాను మిగిలిపోయాయి.. ఏం జరుగుతుందో అర్థంగాని తుగ్లక్ రాగినాణేలు ఎత్తేసి తిరిగి బంగారు,నాణేలు అమల్లోకి తెచ్చాడు..ఇక్కడ ఇంకా విమర్శల పాలయ్యాడు..రాగి నాణేలు అమల్లోకి తేవడానికి చాలా లోతైన ఆలోచనే ఉంది..కానీ అది సరిగా అమలు కాలేదు.. ఈ రెండు అంశాలు తుగ్లక్ వంశ చరిత్రను భ్రష్టుపట్టించేలా చేశాయి.. 1351 సం.లో మహ్మద్ బిన్ తుగ్లక్ చనిపోయారు..కానీ ఆతర్వాత చరిత్ర అతన్ని పిచ్చితుగ్లక్ గా కీర్తించింది. అతని నిర్ణయాలు , తెచ్చిన సంస్కరణలు అన్నీ పిచ్చినిర్ణయాలుగానే చరిత్రలో నిలిచిపోయాయి..

జనాలు ఇప్పటికీ తుగ్లక్‌ పేరును ప్రజలు, రాజకీయనాయకులు విమర్శకు మారుపేరుగా వాడుకుంటున్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడమే తుగ్లక్ నైజం అన్నట్టుగా చరిత్ర అతన్ని జనాలకు పరిచయంచేసింది. తండ్రి ఘియాజుద్దీన్ సుల్తాన్ మరణానికి కారణం వేరు..అలాగే రాజధాని మార్పుకు అసలు ఆలోచన వేరు..అలాగే నాణేలు మార్పిడికికారణం వేరు..కానీ అవన్నీ తుగ్లక్‌ను పిచ్చివాడిగానే గుర్తించేలా చేశాయి..

తుగ్లక్‌పై తమిళ జర్నలిస్టు చో రామస్వామి 1968లో ఓ నాటకాన్ని రాశారు.. అప్పట్లో ఇది చరిత్ర సృష్టించింది. అందుకే తమిళనాడులో ఛో రామస్వామి పత్రిక పేరు కూడా తుగ్లక్ అనే పెట్టుకున్నారు. ఆయన రాసిన నాటకం ఆధారంగా 1972లో తెలుగులో మహమ్మద్ బిన్ తుగ్లక్ పేరుతో బీవీపసాద్ దర్శకత్వంలో సినిమా కూడా వచ్చింది.. రక్తకన్నీరు నాగభూషణం తుగ్లక్ పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు దర్శకుడు దాసరినారాయణరావు మాటలు రాశారు..

మహమ్మద్ బిన్ తుగ్లక్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మన పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలకు ఏమాత్రం సంబంధం లేకపోయినప్పటికీ… పాలకుల నిర్ణయాలను తప్పుబట్టడానికి మాత్రం తుగ్లక్ ఇప్పటికీ పనికొస్తున్నాడు.. అంటే నిర్ణయం తీసుకునే పాలకుని అంతరంగంతోను, ఆ సంస్కరణ ఫలితంతోను సంబంధం లేకుండా ఓ వ్యక్తిని అయితే పిచ్చి వాడుగాను, లేకపోతే మంచివాడుగాను ప్రస్తావించే నైజం ఈనాటిది కాదు.. అది చరిత్ర మూలాల్లోనే వుందన్నది తుగ్లక్ చరిత్ర చదివిన వారికి ఇట్టే అర్థం అవుతోంది. తాజా పరిణామాలకు తుగ్లక్ నామధేయాన్ని అన్వయించుకునే ముందు లోతుపాతుల్ని అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని తుగ్లక్ చరిత్ర గుర్తు చేస్తోంది.

-అశోక్ వేములపల్లి సీనియర్ జర్నలిస్టు, టీవీ9

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో