Breaking News
  • అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు. నగరాల ప్రజలు బయటకు వెళ్లకుండా కట్టడి చేయాలి. వలస కూలీలకు వసతులు, సకాలంలో వేతనాలు చెల్లించేలా చూడాలి. విద్యార్థులు, కార్మికులను ఖాళీ చేయాలని కోరినవారిపై చర్యలు-కేంద్రం.
  • దేశవ్యాప్తంగా ఆల్కహాల్‌ విత్‌డ్రాల్‌ సిండ్రోమ్‌ . కేరళలో మద్యానికి బానిసై ఆరుగురు ఆత్మహత్య. ఆల్కహాల్‌ లేదన్న బాధతో షేవింగ్‌ లోషన్‌ తాగిన ఓ వ్యక్తి. తెలంగాణలో మద్యం దొరకడంలేదని ప్రాణం తీసుకున్న ఓ వ్యక్తి. తెలంగాణలో కల్లు దొరకక ఓ వ్యక్తి వింత ప్రవర్తన. ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకోవడంతో మృతి.v
  • తూ.గో: ఉ.6 నుంచి 10 వరకు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతి. జిల్లాలో ఐదు ఐసోలేషన్‌ పడకలు సిద్ధం-మంత్రి పిల్లి సుభాష్‌. 15 వేల మంది ఉండేలా క్వారంటైన్‌ కేంద్రాలు. అక్వా రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం-మంత్రి పిల్లి సుభాష్‌.
  • ప్రధాని మోదీకి రాహుల్‌ లేఖ. మన దేశం పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వ చర్యలకు సహకరించడానికి సిద్ధం-రాహుల్‌. లక్షల సంఖ్యలో రోజువారీ కూలీలు ఉన్నారు. లాక్‌డౌన్‌తో చాలామంది ప్రజలు చనిపోయే పరిస్థితి. లక్షలాది మంది యువత సొంత గ్రామాలకు వెళ్తున్నారు. వారిలో కరోనా ఉంటే తల్లిదండ్రులు, వృద్ధులకు సోకే అవకాశం. కొత్త ఆస్పత్రుల నిర్మాణం వెంటనే చేపట్టాలి-రాహుల్‌.
  • స్పైస్‌ జెట్‌ పైలట్‌కు కరోనా పాజిటివ్‌. మార్చి 21న చెన్నై నుంచి ఢిల్లీకి విమానాన్ని నడిపిన పైలట్‌. స్వీయ నిర్బంధంలోనే పైలట్‌.

హైదరాబాద్‌లో మావోల కలకలం!

TTV student union president held for alleged links with Naxals, హైదరాబాద్‌లో మావోల కలకలం!

మావోయిస్టులతో సంబంధమున్న తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడు మద్దిలేటి సహా..జగన్‌, సాయన్నను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పలు విద్యార్థి సంఘాలు కొంతకాలంగా మావోయిస్టులకు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థి నేతలు సందీప్, అనుదీప్‌, నాగరాజు, గోపి, ఖాసిం, రమేష్‌రెడ్డి..మహేశ్వర్‌రెడ్డి, శంకర్‌రెడ్డిపై గతంలోనే కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. విద్యార్థి నేతల కార్యకలాపాలపై నిరంతరం నిఘా పెట్టామని పోలీసుల వెల్లదించారు. దీనికి సంబంధించిన 30 సంస్థలను నిషేధించినట్టు పోలీసుల ప్రకటించారు. గత కొంతకాలంగా మావోయిస్టులతో టచ్‌లో ఉన్న జగన్‌ మావోయిస్టులకు ఫండ్స్‌ ఇవ్వాలని కార్పొరేట్‌ కంపెనీలను బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. జగన్‌, మద్దిలేటి ఇళ్లలో మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జగన్‌, మద్దిలేటిపై పుణె, కర్నాటకలో కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) సంస్థ నిషేధిత మావోయిస్టు పార్టీ నుంచి ఆవిర్భవించిందని హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ అన్నారు. రెండు రోజులుగా నగరంలో అలజడిరేపుతున్న టీవీవీ నాయకుల అరెస్టులపై.. ఆయన శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మావోయిస్టు పార్టీసహా.. పలు సంస్థలను రాష్ట్రప్రభుత్వం నిషేధించిందన్నారు. వివిధ సంఘాల పేరుతో విద్యార్థులు, యువతను ఆకర్షిస్తూ.. మావోయిజం వైపు మళ్లిస్తున్నారని సీపీ ఆరోపించారు. టీవీవీ నేతలకు.. దంతేవాడ, బీజాపూర్‌లలో ఉన్న మావోయిస్టులో సంబంధాలున్నాయనే ఆధారాలు తమకు లభించాయన్నారు. దీనిపై నాగరాజు అలియాస్‌ నాగన్నపై గద్వాల్‌లో, రాహుల్‌పై సుబేదారిలో, గోపీపై సూర్యాపేటలో, ఖాసీంపై అమ్రాబాద్‌, మహబూబ్‌నగర్‌, వనపర్తి, ములుగులో, రమేశ్‌పై నాచారం పీఎ్‌సలో, మహేశ్వర్‌రెడ్డిపై సూర్యాపేట, ఓయూలో, దేవిరెడ్డిపై సూర్యాపేట, పంజాగుట్టల్లో కేసులున్నాయన్నారు. వీరితో పాటు సాయన్న, పురుషోత్తమ్‌రెడ్డిపైనా కేసులు ఉన్నాయని సీపీ వివరించారు. నల్లకుంట పీఎస్‌ పరిధిలో బండారి మద్దిలేటి(30) ఇంట్లో జరిపిన సోదాల్లో విప్లవ సాహిత్యం లభ్యమైందని తెలిపారు.

నిషేధిత సంస్థలు: 

ఆదివాసీ విద్యార్థి సంఘం, చైతన్య మహిళా సంఘం, సివిల్‌ లిబర్టీ కమిటీ, కమిటీ ఫర్‌ రిలీజ్‌ ఆఫ్‌ పొలిటికల్‌ ప్రిజనర్స్‌, డెమోక్రటిక్‌ స్టూడెంట్‌ యూనియన్‌, హ్యూమన్‌ రైట్స్‌ ఫోరం, కుల నిర్మూలన పోరాట సమితి, పాట్రియాటిక్‌ డెమోక్రటిక్‌ మూవ్‌మెంట్‌, ప్రజాకళా మండలి, తెలంగాణ డెమోక్రటిక్‌ ఫోరం, తెలంగాణ ప్రజా ఫ్రంట్‌, తెలంగాణ విద్యార్థి సంఘాలతో పాటు.. పాత సంఘాలు రాడికల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌, రాడికల్‌ యూత్‌ లీగ్‌లను రాష్ట్రంలో నిషేధించారని సీపీ వివరించారు. కాగా.. ఈ సంస్థలపై నిషేధం లేదని మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు జీవన్‌కుమార్‌ అన్నారు.

 

Related Tags