ఇరాన్ మిసైల్ ప్రోగ్రామ్ పై ట్రంప్ కన్ను.. ఇమేజ్ ప్రూఫ్ !

trump tweets iran missile site rising us surveillance secrets, ఇరాన్ మిసైల్ ప్రోగ్రామ్ పై ట్రంప్ కన్ను.. ఇమేజ్ ప్రూఫ్ !

ఇరాన్ క్షిపణి కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కన్ను వేశారా ? ఆయన ఇటీవల పోస్ట్ చేసిన ఓ ఏరియల్ ఇమేజీని చూస్తే ఇదే అనుమానం కలుగుతోంది. ఇందులో భాగంగా ఇరాన్ గగన తల నిబంధనలను అమెరికా ఉల్లంఘిస్తోందని అనడానికి ఇదే నిదర్శనమని అంటున్నారు. ఈ ఫోటోను బహుశా విమానం లేదా డ్రోన్ తో తీసి ఉండవచ్ఛునన్నది వారి వాదన. ఇది శాటిలైట్ తో మాత్రం తీసినది కాదని జెఫ్రీ లెవిస్ అనే ఎక్స్ పర్ట్ అభిప్రాయపడ్డారు.(ఈయన అమెరికావాడే). తమ దేశంలోని మిసైల్ సైట్స్, ఇతర కీలక ప్రాంతాల సమాచారాన్ని, ఫోటోలను అమెరికా సేకరిస్తుందని ఇరాన్ భావిస్తోంది. గత జూన్ లో అమెరికాకు చెందిన ఓ సర్వే లెన్స్ డ్రోన్ ని ఇరాన్ కూల్చివేసిన సంగతి తెలిసిందే. అది తమ గగనతల పరిధిని దాటి ‘ వచ్చిందని ‘ ఆ దేశం మండిపడింది. ఇలా ఉండగా తన చర్యని ట్రంప్ సమర్థించుకున్నారు. నిజానికి ఇరాన్ మిసైల్ లాంచ్ పాడ్ కి ప్రమాదం జరగడంతో ఆ సెంటర్ పూర్తిగా ధ్వంసమైంది. హై రిసల్యూషన్ ఇమేజీని ట్రంప్ పోస్ట్ చేయడంతో అమెరికా తన ఉపగ్రహాలతో ఇతర దేశాలపై రహస్యంగా నిఘా పెడుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే ఇరాన్, అమెరికా మధ్య పచ్ఛగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఈ తరుణంలో ట్రంప్ చర్య ఈ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత కుదారి తీసేదిగా ఉందని అంటున్నారు. ఇటీవల ఇరాన్ మిసైల్ సెంటర్ డ్యామేజీ అయిన ఘటనలో తమ దేశ తప్పిదమేమీ లేదని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ తన స్పేస్ సెంటర్ నుంచి సాఫిర్ ఎస్ ఎల్వీ ని రోదసిలోకి ప్రయోగించాలని చూసినా అది విఫలమైంది. దీనిపై ట్రంప్ తన ట్విటర్లో సెటైరిక్ గా స్పందించారు. ఏది-ఏమైనా ఈయన ఓ వైపు నార్త్ కొరియాకు దగ్గరవుతూ.. మరోవైపు గల్ఫ్ దేశాలకు శత్రువులా మారుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *