పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన‌ కేసీఆర్!

TRS Executive Meeting, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన‌ కేసీఆర్!

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజు అన్ని గ్రామాల్లో సంబరాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ రోజు(బుధవారం) తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ కార్యవర్గం భేటీ అయింది. ఈ భేటీలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లు, మున్సిపల్ ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదు, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంపై చర్చించారు. త్వరలోనే టీఆర్ఎస్ కమిటీల నియామకం చేపడతామని కేసీఆర్ తెలిపారు.

ఈనెల 27న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీతో పార్టీ అధినేత కేసీఆర్ సమావేశం కానున్నారు. అదే రోజు నుంచి నెల రోజుల పాటు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనున్నారు. పార్టీ కార్యాలయాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం రూ. 19.2 కోట్ల నిధులు కేటాయించారు. ఒక్కో జిల్లాలో టీఆర్ఎస్ భవనానికి రూ.60 లక్షలు కేటాయించారు. నామినేటెడ్ పోస్టుల్లో రాష్ట్ర కమిటీ సభ్యులకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *