Trivikram: త్రివిక్రమ్‌ను వెంటాడుతోన్న ‘మైత్రీ’ ఇష్యూ..!

'అల వైకుంఠపురములో' మూవీతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్న త్రివిక్రమ్.. ఇటీవలే ఎన్టీఆర్‌తో రెండో సినిమాను ప్రకటించారు. ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్‌ను తయారుచేసే పనిలో ఆయన పడ్డారు.

Trivikram: త్రివిక్రమ్‌ను వెంటాడుతోన్న 'మైత్రీ' ఇష్యూ..!
Follow us

| Edited By:

Updated on: Feb 26, 2020 | 8:01 PM

‘అల వైకుంఠపురములో’ మూవీతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్న త్రివిక్రమ్.. ఇటీవలే ఎన్టీఆర్‌తో రెండో సినిమాను ప్రకటించారు. ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్‌ను తయారుచేసే పనిలో ఆయన పడ్డారు. అయితే ఆయన కెరీర్‌ విజయవంతంగా కొనసాగుతున్నప్పటికీ.. కొన్ని వివాదాలు త్రివిక్రమ్‌ను వెంటాడుతున్నాయి. ముఖ్యంగా అఆ సినిమా నుంచి కాపీ మరకలు ఆయనపై ఎక్కువవుతున్నాయి(అతడు, జులాయి, అత్తారింటికి దారేది సినిమాల్లోనూ కాపీ వివాదం నడిచినప్పటికీ.. అవి కొన్ని సీన్లకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే ). ఇక నిన్నటికి నిన్న అల వైకుంఠపురములో విషయంలోనూ ఆ కథ తనదేనంటూ ఓ రచయిత వార్తలకెక్కారు. అయితే ఈ కాపీ వివాదం పక్కనపెడితే ఇప్పుడు మరో వివాదం త్రివిక్రమ్‌ను వెంటాడుతోందట.

ఇప్పుడు టాలీవుడ్‌లో బడా నిర్మాతగా పేరొందిన మైత్రీ మూవీ మేకర్స్.. నిర్మాణ రంగంలోకి వచ్చిన కొత్తలోనే త్రివిక్రమ్‌కు కొంత అడ్వాన్స్ ఇచ్చి, ఓ సినిమాను అగ్రిమెంట్ చేయించుకుందట. అయితే కొన్ని కారణాల వలన ఆ నిర్మాణ సంస్థతో సినిమాను చేయలేకపోయారట త్రివిక్రమ్. మరోవైపు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఆయనకు హోం బ్యానర్‌లా మారిపోవడంతో.. ఆ సంస్థతోనే వరుస సినిమాలు చేస్తూ, దాన్ని వదిలి త్రివిక్రమ్ బయటకు రాలేకపోతున్నారట. అయితే తాము ఇచ్చిన అడ్వాన్స్‌ను వెనక్కి ఇచ్చేయాలని మైత్రీ సంస్థ ఎప్పటినుంచో త్రివిక్రమ్‌ను అడుగుతుందోట. దీంతో ఈ వివాదాన్ని సద్దుమణిగించేందుకు మధ్యవర్తిత్వం తీసుకున్న హారిక సంస్థ మైత్రీ వారు ఇచ్చిన అడ్వాన్స్ కంటే రెట్టింపు ఇస్తామని అన్నారట. కానీ దానికి మైత్రీ సంస్థ వారు ఒప్పుకోలేదట. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా ప్రకటన తరువాత మరోసారి మైత్రీ సంస్థ, త్రివిక్రమ్‌కు తమ అడ్వాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. అంతేకాదు ఇచ్చిన అడ్వాన్స్‌కు మూడు రెట్లు ఎక్కువగా ఇవ్వాలని వారు అంటున్నారట. దీంతో మళ్లీ హారిక సంస్థ లైన్‌లోకి వచ్చిందట. ఈ నేపథ్యంలో త్వరలోనే త్రివిక్రమ్‌ సమస్యను తీరనున్నది సమాచారం.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు