ఎంతోమంది ప్రయాణీకులు ఇండియన్ రైల్వేస్‌ను తమ ప్రయాణాలకు ప్రతి నిత్యం వినియోగిస్తుంటారు. కొందరు ఎంచక్కా తమకు రిజర్వ్ చేసిన బెర్త్‌ల్లో ప్రయాణిస్తుంటే.. మరికొందరు రిస్క్ చేసి మరీ రైలు ప్రయాణాలు చేస్తారు. ఇక ఇంకొందరైతే.. సెల్ఫీల పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఇదంతా ఒక రకమైతే.. ఇప్పుడు మేము చూపించబోయే ప్రయాణీకులు మరో రకం. వీరు ఏం చేశారో చూస్తే.. మీ గుండె జళ్లుమనడం ఖాయం.
వైరల్ వీడియో ప్రకారం.. అత్యంత ప్రమాదకర రీతిలో కొందరు ఏకంగా రైలు టాప్ ఎక్కి మరీ ప్రయాణిస్తున్నారు. అంతేకాదు ఏకంగా అక్కడే నిద్రపోతున్నారు. రైలు వేగంగా వెళ్తోందని.. తాము టాప్ ఎక్కి పడుకున్నామన్న సోయి లేకుండా.. నిశ్చింతగా నిద్రపోతున్నారు. ఇక ఆ టాప్ ఎక్కి నిద్రపోయిన వారిలో పురుషులు మాత్రమే కాదు, మహిళలు, టీనేజర్లు సైతం ఉన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుండగా.. దీనిని చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ప్రయాణించడానికి ఇంత రిస్క్ అవసరమా.? లేక కావాలనే వీరిది బరీతెగింపా అంటూ నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చిపడుతున్నాయి. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.
ఇది చదవండి: మరీ ఇలా ఉన్నావ్.. ఇదేం కోరిక తల్లి.. ఆమె ఆశలు విన్నారంటే మగాళ్ల గుండెలు హడల్
मजबुरी होगी नहीं तो इतना रिस्क कोई नहीं लेता हैं। pic.twitter.com/54X3NIekZX
— Hansraj Meena (@HansrajMeena) June 9, 2024
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి