NRI Marriage: ప్రియుడికి వేరొకరితో నిశ్చితార్థం.. రష్యా నుంచి వచ్చిన ప్రియురాలు.. చివరికి..?

|

Feb 09, 2022 | 12:28 PM

రష్యాలో ప్రేమించుకున్నారు. పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. భాషలు వేరు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు పెళ్ళికి(NRI Marriage) ఒప్పుకోలేదు. చేసేదేమీ లేక అబ్బాయి...

NRI Marriage: ప్రియుడికి వేరొకరితో నిశ్చితార్థం.. రష్యా నుంచి వచ్చిన ప్రియురాలు.. చివరికి..?
Russian Marrigae
Follow us on

రష్యాలో ప్రేమించుకున్నారు. పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. భాషలు వేరు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు పెళ్ళికి(NRI Marriage) ఒప్పుకోలేదు. చేసేదేమీ లేక అబ్బాయి వేరే పెళ్ళికి సిద్ధమై నిశ్చితార్థం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న యువతి.. హుటాహూటిన రష్యా నుంచి ఇండియాకు వచ్చింది. స్థానిక నేతలు, పోలీసుల సహాయతో ఆ యువకుడిని పెళ్ళి చేసుకుంది. గుంటూరు(Guntur) జిల్లా సత్తెనపల్లిలో ఈ ఘటన జరిగింది. సత్తెనపల్లి మండలంలోని లక్కరాజు గార్లపాడుకు చెందిన అనంత కుమార్.. 2015 లో ఎంబీబీఎస్ చదివేందుకు రష్యా వెళ్ళాడు. ఆ సమయంలో తమిళనాడుకు చెందిన సెల్సియా అనే యువతితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారింది.

ప్రేమించుకున్న వీరద్దరూ పెళ్లికి సిద్ధమయ్యారు. వీరి వివాహానికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. చదువు పూర్తి చేసుకున్న అనంత కుమార్ స్వగ్రామం చేరుకున్నాడు. సెల్సియా రష్యాలోనే ఉండిపోయింది. అనంత్ కుమార్ తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని అనంత్ ను ఒత్తిడి చేశారు. తమ ప్రేమ, పెళ్లి గురించి మరోసారి సెల్సియా తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేసినా వారు ససేమిరా అన్నారు. దీంతో చేసేదేమీ లేక వేరొక అమ్మాయితో అనంత్ కుమార్ నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సెల్సియా సోషల్ మీడియాను ఆశ్రయించింది. ఈ విషయాన్ని గమనించిన స్థానిక నేత ఒకరు వాట్సాప్ కాల్ లో మాట్లాడారు. అనంతరం సెల్సియా రష్యా నుంచి సత్తెనపల్లి చేరుకుంది.

ఈ విషయాన్ని స్థానిక నేతలు.. సత్తెనపల్లి సీఐ ఉమేష్ దృష్టికి తీసుకెళ్ళారు. సీఐ ఉమేష్ అనంత్ కుమార్ తో, అతని తల్లిదండ్రులతోనూ మాట్లాడారు. సెల్సియాను పెళ్లి చేసుకునేందుకు ఒప్పించారు. దీంతో నిశ్చితార్థాన్ని అనంత్ కుమార్ రద్దు చేసుకున్నాడు. స్థానిక సత్తెనపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో సెల్సియాను వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సెల్సియా తల్లిదండ్రులూ సత్తెనపల్లి చేరుకున్నారు. వారిద్దరికీ సత్తెనపల్లి సీఐ ఉమేష్ చట్టబద్దంగా జరిగిన పెళ్లి గురించి వివరించి సహకరించాలని కోరారు. ఈ ఘటన వీరి ప్రేమ కథ సుఖాంతం అయింది.

   – టి. నాగరాజు, టీవీ9 తెలుగు, గుంటూరు

Also Read

Tirumala: త‌రిగొండ వెంగ‌మాంబ ధ్యాన‌మందిర నిర్మాణానికి టిటిడీ సన్నాహాలు.. బ్లూ ప్రింట్ సిద్ధం చేయాలని సూచన

Hijab Row: చదువుకునే విద్యార్థుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.. హిజాబ్‌ వివాదం పై స్పందించిన కమల్

Trekker Stuck: మృత్యుంజయుడు.. చావుకు, బతుక్కి మధ్య 40 గంటల పోరాటం.. పాలక్కడ్ కొండల్లో చిక్కుకున్న ట్రెక్కర్ సేఫ్