Watch: నది శుభ్రం చేస్తుండగానే పైనుంచి చెత్త.. ఇలాంటి ఇడియెట్స్‌కు కొదవే లేదు..!

నదులు, జలవనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కానీ కొందరి నిర్లక్ష్యం పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నవారికి తీవ్ర నిరాశను కలిగిస్తోంది. దీనికి ఉదాహరణగా నిలుస్తోంది మధ్యప్రదేశ్‌లోని అజ్నార్ నది పరిస్థితి. నదిని శుభ్రం చేసేందుకు నెలల తరబడి శ్రమిస్తున్న 20 ఏళ్ల యువ పర్యావరణ కార్యకర్త సురేంద్ర సింగ్ చౌదరి అలియాస్ బిట్టు తబాహి.. చెత్తను తొలగించిన కొద్దిరోజులకే మళ్లీ వ్యర్థాలు పేరుకుపోతుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు.

Watch: నది శుభ్రం చేస్తుండగానే పైనుంచి చెత్త.. ఇలాంటి ఇడియెట్స్‌కు కొదవే లేదు..!
Environment Activist Bittu Tabahi

Updated on: Oct 26, 2026 | 5:05 PM

నదులు, జలవనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కానీ కొందరి నిర్లక్ష్యం పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నవారికి తీవ్ర నిరాశను కలిగిస్తోంది. దీనికి ఉదాహరణగా నిలుస్తోంది మధ్యప్రదేశ్‌లోని అజ్నార్ నది పరిస్థితి. నదిని శుభ్రం చేసేందుకు నెలల తరబడి శ్రమిస్తున్న 20 ఏళ్ల యువ పర్యావరణ కార్యకర్త సురేంద్ర సింగ్ చౌదరి అలియాస్ బిట్టు తబాహి.. చెత్తను తొలగించిన కొద్దిరోజులకే మళ్లీ వ్యర్థాలు పేరుకుపోతుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు.

నదిని శుభ్రం చేస్తుండగా చెత్త విసిరిన వ్యక్తి?

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో చౌదరి షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నవరాత్రి, దసరా వేడుకల అనంతరం అజ్నార్ నదిలో ప్లాస్టిక్ సంచులు, పూలమాలలు, ఇతర వ్యర్థాలు పెద్దఎత్తున పేరుకుపోయాయి.. బిట్టు తబాహి.. గ్లౌజులు ధరించి నదిలోని చెత్తను తొలగిస్తున్నారు. అదే సమయంలో.. వంతెనపై ఉన్న ఓ వ్యక్తి తాను పనిచేస్తున్న ప్రాంతం వైపు చెత్త సంచిని విసిరినట్లు చౌదరి ఆరోపించారు. నదిని శుభ్రం చేసేందుకు తాను కష్టపడుతుంటే, కొందరు మళ్లీ చెత్త వేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

ఎనిమిది నెలలుగా నిరంతర పోరాటం

అజ్నార్ నదిని శుభ్రం చేసేందుకు చౌదరి గతంలో ఎనిమిది నెలల పాటు అధునాతన పరికరాల సాయం లేకుండానే శ్రమించి, టన్నుల కొద్దీ వ్యర్థాలను తొలగించారు. ఆయన కృషికి సోషల్ మీడియాలో ప్రశంసలు లభించాయి. ప్రజలు చెత్తను బాధ్యతగా పారవేయాలనే ఉద్దేశంతో నది ఒడ్డున రెండు చెత్తబుట్టలను కూడా ఏర్పాటు చేశారు. అయితే వాటిలో ఒకటి కనిపించకుండా పోవడంతో ఆయన నిరాశకు గురయ్యారు.

నదిని కాపాడటం అందరి బాధ్యత

తాజా వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ చౌదరి కృషిని ప్రశంసించారు. నదుల్లో చెత్త వేసేవారికి భారీ జరిమానాలు విధించాలని, పర్యావరణ పరిరక్షణ బాధ్యత ఒక్కరిదే కాదని అభిప్రాయపడ్డారు. మరికొందరు పౌర బాధ్యత, చెత్త నిర్వహణపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నదిని ఒకసారి శుభ్రం చేయడం కంటే, మళ్లీ కలుషితం కాకుండా చూడటం మరింత ముఖ్యమని ఈ ఘటన గుర్తుచేస్తోంది. ప్రజల సహకారం, బాధ్యతాయుతమైన ప్రవర్తన, వ్యర్థాల సరైన నిర్వహణ ఉన్నప్పుడే ఇలాంటి శుభ్రత కార్యక్రమాలు శాశ్వత ఫలితాలను ఇస్తాయి.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us