విమాన ప్రయాణంలోనే ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. తమరా అనే మహిళ విమానం వాష్‌రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. సదరు మహిళకు తను గర్భవతి అన్న విషయమే తెలియదట. తను గర్భవతి అని తెలియకుండానే విమానంలో ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. ఈక్వెడార్‌లోని గుయాక్విల్ నుంచి ఆమ్‌స్టర్‌డామ్ వెళ్తున్న డచ్ విమానం KLM రాయల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ మహిళ ఈక్వెడార్ నుంచి స్పెయిన్‌కు వెళుతోంది. ఆమ్‌స్టర్‌డామ్ చేరుకోవడానికి కొన్ని గంటల ముందు ఆ మహిళకు కడుపునొప్పి వచ్చింది.
హార్లెమ్ స్యూడ్ హాస్పిటల్ ప్రతినిధి స్పార్నే గస్తుయిస్ NL టైమ్స్‌తో మాట్లాడుతూ,ఆ మహిళ తనకు అసౌకర్యంగా అనిపించినప్పుడు వాష్‌రూమ్‌కు వెళ్తున్నానని చెప్పింది. తామరాకు తాను గర్భవతి అని తెలియదని, ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురైనట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఆస్ట్రియాకు చెందిన ఇద్దరు వైద్యులు ఒక నర్సు విమానంలో ఉన్నారు. యువతికి అవసరమైన సంరక్షణ అందించామని విమానయాన సంస్థ ప్రతినిధి తెలిపారు. వైద్యులు, నర్సులకు విమానయాన సంస్థ రుణపడి ఉంటుందని కూడా ప్రతినిధి తెలియజేశారు.
తనకు సహాయం చేసిన ప్రయాణీకులలో ఒకరి పేరు మీదుగా తామరా పాపకు మాక్సిమిలియానోఅని పేరు పెట్టింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని KLM ఎయిర్‌లైన్ తెలిపింది. షిపోల్‌కు చేరుకున్న తర్వాత, తల్లి, నవజాత శిశువును అంబులెన్స్‌లో వారిని ఆస్పత్రికి తరలించారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి అధికారులు తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి