AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: అదృష్టం వచ్చి లిప్‌లాక్ ఇవ్వడమంటే ఇదే.. పిజ్జా కోసం వెళ్తే.. ఏకంగా లక్షల్లో లాటరీ తగిలింది.!

అదృష్టం ఏ క్షణంలో ఎవరిని ఎలా టచ్‌ చేస్తుందో ఎవ్వరం చెప్పలేం. ఇదిగో ఇక్కడ అలాంటి సంఘటనే జరిగింది.

Viral: అదృష్టం వచ్చి లిప్‌లాక్ ఇవ్వడమంటే ఇదే.. పిజ్జా కోసం వెళ్తే.. ఏకంగా లక్షల్లో లాటరీ తగిలింది.!
Pizza
Ravi Kiran
|

Updated on: Sep 14, 2022 | 9:04 PM

Share

అదృష్టం ఏ క్షణంలో ఎవరిని ఎలా టచ్‌ చేస్తుందో ఎవ్వరం చెప్పలేం. ఇదిగో ఇక్కడ అలాంటి సంఘటనే జరిగింది. అదృష్టం వచ్చి లిప్ లాక్ ఇవ్వడమంటే ఇదేనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే.. పిజ్జా కొందామని వెళ్లిన మహిళకు లక్షల రూపాయలు వచ్చిపడ్డాయి మరి. ఇదెవరైనా ఊహిస్తారా.. చెప్పండి.. అసలు విషయానికి వస్తే…

అమెరికాలోని సౌత్ కరోలినాలో స్వాన్సియా ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. ఏదో పనిమీద బయటికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరుగుముఖం పట్టింది. ఫ్యామిలీ అంతా కలిసి తినేందుకు పిజ్జా తీసుకెళదామని భావించింది. స్వాన్సియాలోని రెయిన్ బో గ్యాస్ స్టేషన్ వద్ద రెస్టారెంటుకు వెళ్లి పిజ్జాలకు ఆర్డర్ చేసింది. పిజ్జాలు రెడీ అవడానికి కాస్త సమయం పడుతుందని చెప్పడంతో కాసేపు ఆ ఆవరణలో తచ్చాడటం మొదలుపెట్టింది. అక్కడ సౌత్ కరొలినా ఎడ్యుకేషన్ లాటరీకి సంబంధించి టికెట్లను విక్రయించడం చూసింది. ఏదో సరదాకి ప్రయత్నిద్దామని రెండు డాలర్లు అంటే సుమారు 160 రూపాయలు పెట్టి జంబో బక్స్ టికెట్లు కొనుగోలు చేసింది.

అవి స్క్రాచ్ కార్డు టైప్ టికెట్లు. ముందుగానే లాటరీ ప్రైజ్ వచ్చే నంబర్లు ఎంపికై ఉంటాయి. టికెట్లను అప్పటికప్పుడు స్క్రాచ్ చేసి చూసుకుని.. ఆ నంబర్ ఉంటే బహుమతి తీసేసుకోవచ్చన్న మాట. అయితే సదరు మహిళ అప్పటికప్పుడే టికెట్లను స్క్రాచ్ చేయలేదు. పిజ్జాలు తీసుకుని ఇంటికి వెళ్లిపోయింది. ఫ్యామిలీ అంతా కలిసి డిన్నర్ చేశాక.. టికెట్లను స్క్రాచ్ చేశారు. అందులో నంబర్లను, బహుమతి వచ్చే నంబర్లను సరిచూసుకుని ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎందుకంటే ఆ టికెట్‌కు 50 వేల డాలర్లు అంటే సుమారు 40 లక్షల రూపాయలు లాటరీ తగలిగింది. మొదట తన కుటుంబ సభ్యులు లాటరీ తగిలిందంటే నమ్మలేదని.. నంబర్లను ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని ఎగిరి గంతేశారని ఆమె చెప్పింది.

Follow Us
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?