
తైవాన్ నుండి ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. మరణించిన వ్యక్తి వేలిముద్రలను ఉపయోగించి 8.5 మిలియన్ తైవానీస్ డాలర్లు (సుమారు రూ. 2.3 కోట్లు) విలువైన నకిలీ ప్రామిసరీ నోట్ తయారు చేసింది ఓ కిలాడీ లేడి. ఇలా దొంగ సంతకం తీసుకున్నందుకు గానూ 59 ఏళ్ల మహిళకు రెండేళ్ల జైలు శిక్ష విధించబడింది. ఈ వింత సంఘటన హ్సించు నగరంలోని ఒక అంత్యక్రియల కేంద్రంలో జరిగింది. నివేదికల ప్రకారం, లి అనే మహిళ పెంగ్ అనే వ్యక్తి అంత్యక్రియల సమయంలో అతని దగ్గరికి వచ్చి, తాను పెంగ్ కి సన్నిహిత స్నేహితురాలని చెప్పుకుంది.
కానీ త్వరలోనే, లీ వింత ప్రవర్తన అంత్యక్రియలకు హాజరైన వారిలో అనుమానాన్ని రేకెత్తించింది. ఆమెకు అవకాశం లభించిన వెంటనే, ఆమె పెంగ్ మృతదేహాన్ని తీసుకెళ్తున్న వాహనంలోకి ప్రవేశించింది. ఆమె మృతదేహం కట్టి ఉంచిన సంచిని విప్పి, పెంగ్ వేలును కాగితంపై నొక్కింది. దానిపై ఆమె ఇప్పటికే నకిలీ తనఖా, ప్రామిసరీ నోట్‌ను సిద్ధం చేసింది.
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన మహిళ:
అంత్యక్రియల కేంద్రంలోని ఒక ఉద్యోగి వెంటనే పెంగ్ కుటుంబాన్ని అప్రమత్తం చేశాడు. ఆ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు లేడీని అక్కడికక్కడే అరెస్టు చేశారు పోలీసులు. దర్యాప్తులో నకిలీ తనఖా పత్రాలు, బ్యాంకు చెక్, ఇంక్ ప్యాడ్‌ను గుర్తించారు పోలీసులు. విచారణలో లీ నేరం అంగీకరించింది. పెంగ్ తో తనకు ఆర్థిక వివాదం ఉందని ఆమె చెప్పింది. పెంగ్ మరణం తర్వాత తన డబ్బును తిరిగి పొందలేనని ఆమె భయపడింది. అందువల్ల, ఆమె మే 23, 2010 నాటి నకిలీ భూమి తనఖా పత్రాన్ని సృష్టించి, పెంగ్ తనకు $8.5 మిలియన్లు బాకీ ఉన్నట్లు చూపించడానికి ప్రయత్నించింది.
కోర్టు తీర్పు,శిక్ష:
లీ నకిలీ పత్రాలను సృష్టించినందుకు దోషిగా నిర్ధారించిన కోర్టు ఆమెకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, తాను నేరాన్ని అంగీకరించినందున, మోసపూరిత చెక్కును ఇంకా బ్యాంకులో జమ చేయకపోవడంతో కోర్టు ఆమె శిక్షను ఐదు సంవత్సరాల పాటు నిలిపివేస్తున్నట్టుగా కోర్టు చెప్పింది. దీంతో పాటు, లీకి 50 వేల న్యూ తైవాన్ డాలర్లు (సుమారు రూ. 1.6 లక్షలు) జరిమానా విధించారు. 90 గంటల సమాజ సేవ చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా, నేను ఈ పరిశ్రమలో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నానని, కానీ, అలాంటి కేసును మొదటిసారి చూశానని అంత్యక్రియల ప్రదేశంలో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..