Viral Video: పాపం ఈ అక్క కష్టం ఎవరికీ రావొద్దు.. వీడియోను నవ్వకుండా చూడండి మీకోసమే.!

మనలో చాలామందికి ఇంజెక్షన్లు అంటే భయం. కొందరు సూది మందు వేయించుకునేటప్పుడు.. వెక్కి.. వెక్కి.. మరీ ఏడుస్తుంటారు. ఇంజెక్షన్ పూర్తయ్యేవరకు..

Viral Video: పాపం ఈ అక్క కష్టం ఎవరికీ రావొద్దు.. వీడియోను నవ్వకుండా చూడండి మీకోసమే.!
Covid Vaccine Woman

Updated on: Jun 29, 2021 | 11:41 AM

మనలో చాలామందికి ఇంజెక్షన్లు అంటే భయం. కొందరు సూది మందు వేయించుకునేటప్పుడు.. వెక్కి.. వెక్కి.. మరీ ఏడుస్తుంటారు. ఇంజెక్షన్ పూర్తయ్యేవరకు కళ్లు పక్కకి తిప్పుకోవడం.. లేదా కళ్లు మూసుకోవడం లాంటివి చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. సరిగ్గా ఓ మహిళకు ఇదే పరిస్థితి ఎదురైంది. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఆమె పడిన బాధను చూసిన నెటిజన్లు.. పాపం ఈ అక్క కష్టం ఎవరికీ రాకూడదు గురూ! అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి వీడియోపై లుక్కేయండి.!

అయ్యో! ఎంత కష్టం వచ్చిందో ఈమెకు. పాపం కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకుచిన్న పిల్లలా వెక్కివెక్కి ఏడుస్తోంది. తన చేతికి సూది గుచ్చేందుకు సిద్ధం కావటమే ఆలస్యం భయపడి చస్తోంది. అసలు వద్దు బాబోయ్ అని మారాం చేస్తోంది. మెల్లగా ఇవ్వండి ప్లీజ్.. మెల్లగా అంటూ వైద్య సిబ్బందిని బ్రతిమిలాడుకుంటోంది. అయితే ఇంతలోనే చాకచక్యంగా వ్యాక్సినేషన్‌ని నర్స్ పూర్తి చేశారు.

Also Read: ఈ ఫోటోలో మరో చిరుత దాగుంది.. కనిపెట్టగలరా! గుర్తు పట్టలేదా.? అయితే ఈ క్లూ ట్రై చేయండి..

తెలుగు వార్తలు లైవ్ ఇక్కడ చూడండి