మెట్రోను స్పా గా మార్చేసిన యువతి.. బాత్‌రోబ్‌లో కనిపించి షాకిచ్చిన స్పా క్వీన్ వీడియో వైరల్‌..!

భారతదేశంలోని వివిధ నగరాల్లో నడిచే మెట్రో రైళ్లలో జరిగే విచిత్ర సంఘటనలు, రీల్స్‌ తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా ఢిల్లీ మెట్రోకు సంబంధించిన వింత వీడియోలు నిత్యం నెట్టింట చర్చనీయాంశమవుతుంటాయి. తాజాగా ఈ కోవకే చెందిన మరో ఆసక్తికరమైన ఘటన ముంబై మెట్రోలో చోటుచేసుకుంది. ఓ యువతి ఏకంగా బాత్‌రోబ్ ధరించి, ముఖానికి స్పా మాస్క్‌లు వేసుకుని మెట్రోలో ప్రయాణించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

మెట్రోను స్పా గా మార్చేసిన యువతి.. బాత్‌రోబ్‌లో కనిపించి షాకిచ్చిన స్పా క్వీన్ వీడియో వైరల్‌..!
Woman In Bathrobe On Metro

Updated on: Oct 10, 2026 | 1:11 PM

భారతదేశంలోని వివిధ నగరాల్లో నడిచే మెట్రో రైళ్లలో జరిగే విచిత్ర సంఘటనలు, రీల్స్‌ తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా ఢిల్లీ మెట్రోకు సంబంధించిన వింత వీడియోలు నిత్యం నెట్టింట చర్చనీయాంశమవుతుంటాయి. తాజాగా ఈ కోవకే చెందిన మరో ఆసక్తికరమైన ఘటన ముంబై మెట్రోలో చోటుచేసుకుంది. ఓ యువతి ఏకంగా బాత్‌రోబ్ ధరించి, ముఖానికి స్పా మాస్క్‌లు వేసుకుని మెట్రోలో ప్రయాణించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

నేరుగా బాత్‌రూమ్ నుంచి మెట్రోలోకి వచ్చినట్లుగా..!

వైరల్ అవుతున్న ఆ వీడియోలో, ఒక యువతి ఎలాంటి మొహమాటం లేకుండా బాత్‌రోబ్ వేసుకుని, తలపై టవల్ చుట్టుకుని మెట్రో కోచ్‌లో ప్రయాణిస్తూ కనిపిస్తుంది. ఆమె చూసేందుకు సరిగ్గా బాత్‌రూమ్ నుంచి నేరుగా బయటకు వచ్చినట్లే ఉంది. అంతేకాకుండా ఆమె ప్రయాణ సమయంలో తన కళ్ల కింద అండర్-ఐ ప్యాచెస్ అద్దుకుంటూ, ప్రశాంతంగా మేకప్ సరిచేసుకుంటూ కనిపించింది. చుట్టూ ప్రయాణికులు ఉన్నప్పటికీ ఆమె మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన ఫోన్‌లో మునిగిపోవడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

తోటి ప్రయాణికుల ఆశ్చర్యకరమైన రియాక్షన్స్

ప్రజా రవాణా వ్యవస్థ అయిన మెట్రోలో ఇలాంటి విచిత్రమైన గెటప్‌లో ఒక యువతి కనిపించడంతో తోటి ప్రయాణికులు అవాక్కయ్యారు. ఆమె పక్కనే కూర్చున్న మహిళలు ఆమెను విచిత్రంగా, నమ్మశక్యం కాని రీతిలో గమనించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ఆంటీ అయితే ఆమెను ఆశ్చర్యంగా తదేకంగా చూడగా, వెనుక కూర్చున్న మరో ప్రయాణికురాలు నోటిపై చేయి వేసుకుని అసలేం జరుగుతోందో అర్థంకాక విస్తుపోయింది.

నెటిజన్ల ఫన్నీ కామెంట్లు

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన X, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయింది. నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ అమ్మాయి మెట్రోను తన పర్సనల్ బ్యూటీ పార్లర్ లేదా స్పా లాగా మార్చేసింది అంటూ కొందరు సరదాగా కామెంట్లు చేస్తుంటే, మరికొందరు పబ్లిక్ ప్లేస్‌లలో ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఈ స్పా క్వీన్ వీడియో ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us