Watch Video: ఎవరు తోపు.. రొనాల్డోనా..? మెస్సీనా..? కేరళలో పొట్టు పొట్టుగా కొట్టుకున్న ఫ్యాన్స్.. చివరకు..

ఖతర్‌లో ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ ప్రారంభానికి ముందే కేరళలో ఫిఫా మేనియా మొదలైంది. ఎక్కడ చూసినా సాకర్‌ సందడే.. ఎక్కడ చూసినా మెస్సీ, రొనాల్డో బారీ కటౌట్లే.. తమ ప్లేయర్ గొప్ప అంటే తమ ప్లేయర్ గొప్ప అంటూ పోటీ పడి మరీ బ్యానర్లు కట్టారు.

Watch Video: ఎవరు తోపు.. రొనాల్డోనా..? మెస్సీనా..? కేరళలో పొట్టు పొట్టుగా కొట్టుకున్న ఫ్యాన్స్.. చివరకు..
Kerala Football Fans

Updated on: Nov 22, 2022 | 7:15 AM

Kerala Football fans fight: ఖతర్‌లో ఫుట్ బాల్ సంగ్రామం (Fifa World Cup 2022) జరుగుతుంటే.. కేరళలో అభిమానుల సమరం జరిగింది. మెస్సీ, రొనాల్డో ఫ్యాన్స్ చిత్తు చిత్తుగా కొట్టుకోవడం తెగ వైరల్ అయింది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ.. ఒకరిపై ఒకరు ఎంత భయంకరంగా దాడి చేసుకుంటున్న ఈ విజువల్స్ చూడండి. అక్కడ చూస్తున్న సంగ్రామం చూస్తుంటే.. వాళ్ల మధ్య ఏదో బీభత్సమైన గొడవ జరిగే ఉంటుంది అనుకుంటే పొరపాటే. వాళ్లు కొట్టుకుంటుంది కేవలం ఫుట్ బాల్ కోసం. అవును మీరు వింటున్నది నిజమే.. ఖతర్‌లో జరుగుతున్న ఫుట్‌బాల్ టీమ్‌ల కోసమే.. ఈ ఘటన జరిగింది కేరళలోని కొల్లాంలో.

ఖతర్‌లో ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ ప్రారంభానికి ముందే కేరళలో ఫిఫా మేనియా మొదలైంది. ఎక్కడ చూసినా సాకర్‌ సందడే.. ఎక్కడ చూసినా మెస్సీ, రొనాల్డో బారీ కటౌట్లే.. తమ ప్లేయర్ గొప్ప అంటే తమ ప్లేయర్ గొప్ప అంటూ పోటీ పడి మరీ బ్యానర్లు కట్టారు అభిమానులు. అర్జెంటీనా, బ్రెజిల్‌ మద్ధతుదారులు ఇద్దరూ ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈక్రమంలో ఒకరినొకరు ఎదురుపడ్డారు. ఇరు వర్గాల మధ్య వాదనలు జరిగాయి. అవి కాస్తా శృతిమించడంతో.. ఒకరిపై ఒకరు ఇలా దాడి చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

ఈ ఘటనలో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. ఆటగాళ్లకు అభిమానులు ఉండటం కామనే. కానీ అది పిచ్చిగా మారితే ఇలాగే ఉంటదేమో.. ఎక్కడో ఆడే ప్లేయర్స్ కోసం ఇక్కడ కొట్టుకోవడం ఏంటి. ఏదైనా జరిగితే ఆ కుటుంబాలకు దిక్కెవరంటూ స్థానికులు నిలదీస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..