Viral Video: పాపం.. పెళ్లి వేడుకలో ఊహించని షాక్.. కిందపడిన వధూవరులు.. ఎందుకంటే..?

Bride and Groom fall from swing Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. తాజగా ఓ వివాహ వేడుకకు

Viral Video: పాపం.. పెళ్లి వేడుకలో ఊహించని షాక్.. కిందపడిన వధూవరులు.. ఎందుకంటే..?
Wedding

Updated on: Dec 13, 2021 | 8:26 PM

Bride and Groom fall from swing Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. తాజగా ఓ వివాహ వేడుకకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. వేడుకలా జరుగుతున్న వివాహంలో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. వెడ్డింగ్ ఈవెంట్‌‌లో అకస్మాత్తుగా వరుడు, వధువు కూర్చున్న ఊయల పైనుంచి కిందపడిపోయింది. ఈ ఘటనలో వధూవరులకు చిన్నపాటి గాయాలయ్యాయి. ప్రతిఒక్కరూ పెళ్లి వేడుకను ఘనంగా చేసుకుంటారు. దానికోసం ఈవెంట్ మేనేజర్లను కూడా సంప్రదిస్తారు. హల్దీ వేడుకల నుంచి మొదలై సంగీత్‌, డ్రెస్సింగ్, పెళ్లి వేదిక, రిసెప్షన్ ఇలా అన్నింటికీ వినూత్నంగా తీర్చిదిద్దేలా ప్లాన్ చేసుకుంటారు. అయితే.. వెడ్డింగ్ ఈవెంట్లల్లో భాగంగా గాల్లో ఊయల ఏర్పాటు చేయడం, రథంలో తీసుకురావడం, పల్లికిలో వధువును ఊరేగించడం లాంటివి కూడా ప్లాన్ చేస్తారు. అయితే తాజాగా ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో ఆదివారం జరిగిన ఓ పెళ్లిలో వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. వేదిక దగ్గర సందడి నెలకొంది. ఓ వైపు డీజే, మరోవైపు మిలమిల విద్యుత్ కాంతులు మెరుస్తున్నాయి.

ఈ క్రమంలో అందంగా అలంకరించిన ఓ ఊయలపై వధూవరులు ఆసీనులయ్యారు. ఈ క్రమంలో ఊయల మెల్లగా పైకి వెళ్లిపోయింది. ఈ సమయంలో ఉన్నట్టుండి ఊయలకు ఉన్న ఒకవైపు తాడు తెగిపోవడంతో.. 12 అడుగుల ఎత్తు నుంచి వధువరులు కిందపడిపోయారు. దీంతో పెళ్లి హాజరైన అతిధులంతా ఒక్కసారిగా కంగారు పడ్డారు. నూతన వధూవరులను రక్షించేందకు వేదిక వద్దకు కొందరు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో వధూవరులకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనకు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ బాధ్యత వహించడంతోపాటు వధూవరులకు క్షమాపణలు చెప్పింది.

వైరల్ వీడియో.. 

Also Read:

Tamilnadu: రెండు కిలోమీటర్లు నడిచి కార్యాలయానికి వస్తోన్న కలెక్టరమ్మ.. ఎందుకంటే..

Encounter: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం