Viral Video: ఈ ఎలుగు బంటి క్యాచింగ్ స్కిల్స్ చూస్తే క్రికెటర్లు కూడా ఖంగుతింటారు..

| Edited By: Ravi Kiran

Nov 10, 2021 | 6:39 AM

సోషల్ మీడియా చేతిలోకి వచ్చిన తర్వాత ప్రపంచం చాలా చిన్నదై పోయింది. ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్నది జరిగినా..

Viral Video: ఈ ఎలుగు బంటి క్యాచింగ్ స్కిల్స్ చూస్తే క్రికెటర్లు కూడా ఖంగుతింటారు..
Bear
Follow us on

Viral Video: సోషల్ మీడియా చేతిలోకి వచ్చిన తర్వాత ప్రపంచం చాలా చిన్నదై పోయింది. ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్నది జరిగినా.. అది క్షణాల్లో మన చేతిలో ఉన్న ఫోన్ లో ప్రత్యక్షం అయిపోతుంది. ఇక జంతువులు మనుషులకు మంచి స్నేహితులు. ఇందుకు ఉదాహరణగా చాలా వీడియోలు నెట్టింట ఉన్నాయి. అయితే క్రికెట్ లో మనం చూస్తూ ఉంటాం.. ప్లేయర్స్ అద్భుతంగా ఫీల్డింగ్ చేసి బాల్ ను ఆపుతుంటారు. ఈ క్రమంలో ఎన్నో అద్భుతమైన క్యాచ్ లను కూడా చూస్తుంటాం.. అయితే ఇక్కడ ఓ ఎలుగు బంటి తన అద్భుతమైన క్యాచ్ లతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

జూ లో జంతువులను చూడటానికి వెళ్ళినప్పుడు మనం వాటికి ఆహారాన్ని, ఏదైనా తినే పదార్ధాలను అందిస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఓ ఎలుగుబంటిని చూడటానికి కొంతమంది పర్యాటకులు వచ్చారు. కారులో ఉండి ఆ ఎలుగుబంటి చూస్తూ దానికి బ్రేడ్ ను ఇవ్వడానికి ట్రై చేశారు. ఒకొక్క బ్రేడ్ ను ఎలుగు బంటి వైపు విసిరారు.. వాళ్ళు విసిరిన బ్రేడ్ ను ఆ ఎలుగుబంటి ఎంతో చాకచక్యంగా పట్టుకుంది. కేవలం ఒక్క బ్రేడ్ మాత్రమే కాదు. ఇలా వాళ్ళు విసిరినా దాదాపు అన్ని బ్రేడ్ లను నోటితో కొన్ని.. చేత్తో కొన్ని పట్టుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో పాతదే అయినప్పటికీ మరో సారి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijay Sethupathi: అందుకే విజయ్ సేతుపతి పై దాడి చేశా.. అసలు విషయం బయట పెట్టిన మహా గాంధీ..

Anasuya Bharadwaj: రేపు పుష్ప నుంచి మరో అప్‌డేట్‌.. అనసూయ ఫస్ట్‌లుక్ ను విడుదల చేయనున్న చిత్రబృందం

SP Balasubrahmanyam: మరణాంతరం ఎస్పీబీకి పద్మ విభూషణ్‌తో సత్కారం.. తండ్రి తరపున అవార్డు అందుకున్న తనయుడు చరణ్