ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా.. జంతువుల పట్ల మనుషులు క్రూరంగా ప్రవర్తించడం ఎక్కువైపోయింది. మొన్నీ మధ్య తన ఇంటి దగ్గర అరుస్తోందని.. కుక్కను బైక్‌కు కట్టి.. అరకిలోమీటర్ ఈడ్చుకుని వెళ్లాడు ఓ ప్రబుద్దుడు. అలాగే ఇంకో చోట కోతిని తాడుతో కట్టేసి ఆడుకున్నారు కొందరు యువకులు.. ఇలా దేశంలో ఎక్కడ చూసినా.. జంతువులను క్రూరంగా హింసిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మరికొందరు జంతు ప్రేమికులుగా తమను తాము పైకి చూపించుకుంటే.. పెంపుడు జంతువులను అవసరం అయ్యేంతవరకు ఉంచుకుని.. ఆ తర్వాత మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లి విడిచిపెడుతున్నారు. తాజాగా ఇలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దాన్ని చూశాక మీరు కూడా అతడిపై మండిపడటం ఖాయం.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన కారులో నుంచి దిగి.. వెనకున్న డిక్కీ ఓపెన్ చేశాడు. అందులో నుంచి ఓ కుక్కను కిందకు దింపాడు. అనంతరం ఆ కుక్కను అక్కడ విడిచిపెట్టి.. కారు స్టార్ట్ చేసుకుని వెళ్లిపోతాడు సదరు వ్యక్తి. తన యజమాని.. తనను అక్కడ విడిచిపెట్టేశాడని తెలియక.. ఆ కుక్క కారు వెనుక పరిగెత్తుకుంటూ కొద్దిదూరం వెళ్లి అలసిపోతుంది. ఇక ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీ కెమెరాలలో రికార్డు కావడంతో.. పెంపుడు కుక్కను వదిలించుకున్నానని.. అనుకున్న అతడి ఆనందం ఆవిరి కావడానికి ఎక్కువసేపు పట్టలేదు. కాగా, వైరల్ వీడియో ప్రకారం.. సదరు వ్యక్తి ఇంటి అడ్రెస్‌ను ట్రేస్ చేసిన పోలీసులు.. అతడ్ని అరెస్ట్ చేసి జైలులో ఊసలు లెక్కపెట్టించారు.
Man arrested after he was caught on camera abandoning his German Shepherd pic.twitter.com/81sdeV9rEQ
— CCTV IDIOTS (@cctvidiots) August 7, 2023
కాగా, ఈ వీడియోను ‘CCTV IDIOTS’ అనే ట్విట్టర్ ఎకౌంటు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. దీనికి ఇప్పటివరకు దాదాపు9.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అలాగే 3 వేల ఏడు వందల మంది రీ-పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అందరూ ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మరీ ఇంత క్రూరంగా అతడు ఎలా ప్రవర్తించాడంటూ’ తిట్టిపోశారు.
Fortunately, the dog was rescued by commission members including Kema Condor, the neighbor who tried to stop him, and Meagan Probus, who also lives nearby. The two women have intervened on behalf of dozens of dogs that have been dumped in the area.
“My husband Wraith and I saw…— KB (@99brownKaryl) August 7, 2023
ఇక సదరు వ్యక్తి రోడ్డుపై విడిచిపెట్టి వెళ్లిపోయిన జర్మన్ షెపర్డ్ డాగ్‌ను స్థానిక యానిమల్ వెల్‌ఫేర్ అసోసియేషన్ వాళ్లు రెస్క్యూ చేసినట్టు తెలుస్తోంది.
He was adopted! https://t.co/oNUQPCKfbq
— KB (@99brownKaryl) August 8, 2023
అలాగే ఆ కుక్కకు వేరొక యజమాని కూడా దొరకడం జరిగిందని.. ప్రస్తుతం తన కొత్త ఇంటిలో ఈ పెంపుడు జర్మన్ షెపర్డ్ సంతోషంగా ఉందని యానిమల్ వెల్ఫేర్ సంస్థ అధికారులు స్పష్టం చేశారు.