కుక్కలు, పిల్లులు, రామచిలుక.. ఇలా కొన్ని జంతువులను కొందరు ఇంట్లో పెంచుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ సాధు జంతువులు కాబట్టి.. పెంచుకుంటారు. మరి ఎవరైనా క్రూర జంతువులను పెంపుడు జంతువుల్లా పెంచుకుంటారా.? ఇదేం పిచ్చి ప్రశ్న అని అనుకుంటున్నారేమో.! క్రూర జంతువులను కూడా పెంపుడు జంతువుల్లా పెంచుకునేవారు లేకపోలేదు. అది మన దేశంలో కాదులెండి.. విదేశాల్లో ఈ తంతు కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూస్తే మీరూ షాక్ కావడం ఖాయం.
వైరల్ వీడియో ప్రకారం.. మెయిల్ హోల్‌స్టన్ అనే ఇన్‌ఫ్ల్యూన్సర్ తన బెడ్‌పై ఒక వైపు కొండచిలువను.. మరోవైపు తన పెంపుడు కుక్కతో కలిసి తీరిగ్గా పడుకుని పుస్తకం చదువుతున్నాడు. పక్కనున్నది కొండచిలువ అని ఏమాత్రం భయపడట్లేదు. అదేదో పెంపుడు జంతువు మాదిరిగా కులాసాగా పుస్తకం పేజీలు తిరగేస్తున్నాడు ఆ వ్యక్తి.
ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతుండగా.. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ముందు మనిషిని తినాలా.. లేక కుక్కను తినాలా అని ఓ వ్యక్తి కామెంట్ చేయగా.. నీ ఫాంటసీలు నా చావుకొచ్చాయ్ అంటూ కుక్క తన మనసులో అనుకుంటోందని ఇంకొకరు కామెంట్ చేయగా.. ఏం గుండెరా వాడిది.. ఆ గుండె బతకాలి.. అని అతడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ మరొకరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి