
జిమ్ ఎదుట వర్కౌట్ చేస్తున్న ఓ జిమ్ ఓనర్‌ను బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు నడిరోడ్డుపై కాల్చి చంపిన ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ (CCTV) ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. జింద్ జిల్లాకు చెందిన కపిల్ రెడు అనే వ్యక్తి హన్సీ ప్రాంతంలోని క్రాంతికారి చౌక్ సమీపంలో ఒక జిమ్ నడుపుతున్నాడు. ఎప్పటిలాగే జూన్ 11వ తేదీ ఉదయం కపిల్ తన క్లయింట్స్‌తో కలిసి జిమ్ సమీపంలో ప్రీ-వర్కౌట్ సెషన్ చేస్తున్నాడు.
ఆ సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కపిల్ వెనుక వచ్చి ఆగారు. బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి కిందకు దిగి, తన వద్ద ఉన్న గన్‌తో కపిల్‌పై వరుసగా పది రౌండ్ల కాల్పులు జరిపాడు. అనంతరం వారిద్దరూ మళ్లీ బైక్‌పై అక్కడి నుంచి పారిపోయారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన కపిల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన అక్కడి వారు కపిల్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే అతను మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
సోషల్ మీడియాలో పోస్ట్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం?
అయితే, ఈ ఘటన జరిగిన కాసేపటికే ఈ హత్యకు తానే బాధ్యత వహిస్తున్నట్టు హరి బాక్సర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తిగా అతను చెప్పుకొచ్చాడు. గతంలో షేక్‌పురా, ధని పూరియాలో జరిగిన కాల్పుల ఘటనల్లో కపిల్‌కు కూడా ప్రమేయం ఉందని.. అందుకే అతన్ని చంపాల్సి వచ్చిందని ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు.
murder of a gym owner in hansi haryana pic.twitter.com/VxS2gcBdr7
— yaya (@iamyatinmehta) June 11, 2026
రంగంలోకి దిగిన పోలీసులు
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందిన కపిల్‌పై కూడా గతంలో నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ కేసుల్లో కపిల్ ఇప్పటికే జైలు శిక్ష అనుభవించి, ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నట్టు పేర్కొన్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.