Viral Video: అందరూ ఇంట్లోనే ఉండగా అనుకోని అలజడి.. ఆ పాప చూడకపోయి ఉంటే..

ఈ నిమిషం మనది కావచ్చు.. కానీ మరు నిమిషంలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ప్రమాదం అనేది ఎప్పుడు.? ఎలా.?

Viral Video: అందరూ ఇంట్లోనే ఉండగా అనుకోని అలజడి.. ఆ పాప చూడకపోయి ఉంటే..
Viral Video

Updated on: Apr 05, 2022 | 10:00 AM

ఈ నిమిషం మనది కావచ్చు.. కానీ మరు నిమిషంలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ప్రమాదం అనేది ఎప్పుడు.? ఎలా.? ఎక్కడ నుంచి వస్తుందో ఎవ్వరం చెప్పలేం. ఆ క్షణంలో మనం జాగ్రత్త వహించకపోతే.. ప్రాణాలే పోతాయి. ఈ విషయాన్ని అద్దం పట్టేలా ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూశాక మీరు కూడా అవునని అనడం ఖాయం.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ ఫ్యామిలీ ఎంచక్కా ఇంట్లో సేద తీరుతోంది. గదికి సరిగ్గా మధ్యలో ఫ్యాన్ కింద టేబుల్‌పై ఆహారాన్ని పెట్టుకుని భోజనం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల్లో ఒకరు అటూ.. ఇటూ తిరుగుతున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది కదూ.! అయితే కొద్దిసేపటికి వారి తలపై ఉన్న సీలింగ్ ఫ్యాన్ కొంత ఊడి.. కిందకు జారింది. అయినా స్పీడ్‌గా తిరుగుతూనే ఉంది. కాసేపటికి అది కాస్తా ఒకవైపుకు ఒంగి.. అలా స్పీడ్‌గానే తిరగడం ప్రారంభించింది. ఇక ఆ క్షణం తింటున్న పాప చూపు ఫ్యాన్ వైపు మళ్లింది. మిగిలినవారు కూడా ఆ విషయాన్ని గమనించి పక్కకు జరుగుతారు. పాపను పక్కకు తీసుకెళ్తారు. అంతే! ఆ ఫ్యాన్ ఊడి కింద పడుతుంది. వాళ్లు ఒక్క క్షణం అలెర్ట్ అయ్యి ఉండటంతో.. ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా, ఈ వీడియోను ‘only_sarcasm’ ఇన్ ‌స్టాగ్రామ్ పేజీ అప్‌లోడ్ చేయగా.. వేలల్లో వ్యూస్ వచ్చి పడుతున్నాయి. అలాగే దీనికి ఇప్పటివరకు వెయ్యికి పైగా లైకులు వచ్చాయి. లేట్ ఎందుకు మీరూ వీడియోపై లుక్కేయండి.

ఇవి చదవండి:

Loading...
Unable to load recommendations.
Follow Us