Viral Video: కిరాక్ వీడియో.. యజమాని ప్రమాదంలో ఉందేమోనని శునకం చేసిన పని చూస్తే మైండ్ బ్లాంక్

పెంపుడు జంతువులను యజమానులు ఎలా ప్రేమిస్తారో.. ఆ పెంపుడు జంతువులు కూడా యజమానులపై అంతే ప్రేమ చూపిస్తాయనడానికి ఈవీడియో సరిగ్గా సరిపోతుంది. స్విమ్మింగ్ పైల్ లో ఓ మహిళ స్నానం..

Viral Video: కిరాక్ వీడియో.. యజమాని ప్రమాదంలో ఉందేమోనని శునకం చేసిన పని చూస్తే మైండ్ బ్లాంక్
German Shepherd Pet

Updated on: Aug 17, 2022 | 10:12 AM

Viral News: ఎవరైనా ఆపదలో ఉండటం చూస్తే తోచిన సహాయం చేసి ఆపద నుంచి గట్టెక్కించాలనుకుంటాం.. అదే ఇంట్లో వాళ్లే అయితే వారితో ఉన్న ప్రేమ, అనుబంధం కొద్ది ఎంత రిస్క్ అయినా చేసి ఆపదలో ఉన్న వాళ్లని కాపాడతాం. మనం ఇళ్లల్లో పెట్స్ ను ఎంతో ఇష్టంగా పెంచుకుంటాం. దీంతో అవి కూడా మనతో కలిసిపోతుంటాయి. తనను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న యజమాని అంటే పెంపుడు జంతువులకు ఎంతో విశ్వాసం ఉంటోంది. అన్నింటిలోకెల్లా శునకాన్ని విశ్వాసానికి మారుపేరుగా చెప్తాం. తన యజమాని ప్రమాదంలో ఉందేమోనంటూ ఓ శునకం చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పెంపుడు జంతువులను యజమానులు ఎలా ప్రేమిస్తారో.. ఆ పెంపుడు జంతువులు కూడా యజమానులపై అంతే ప్రేమ చూపిస్తాయనడానికి ఈవీడియో సరిగ్గా సరిపోతుంది. స్విమ్మింగ్ పైల్ లో ఓ మహిళ స్నానం చేస్తుంది. ఇది చూసిన జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఓ శునకం వెంటనే తన యజమాని ప్రమాదంలో ఉందేమోనంటూ ఆ స్విమ్మింగ్ పూల్ లో దూకి ఆ మహిళ జట్టు పట్టుకుని ఒడ్డుకు చేరుస్తుంది. రెడ్డిట్ లో షేర్ చేసిన ఈవీడియోని చూస్తున్నవారంతా ఆ శునకం చేసిన పనిని చేసి నవ్వుతూనే.. యజమానిపై ఎంత విశ్వాసం అంటూ కామెంట్లు చేస్తున్నారు. తనకు స్నానం చేయించలేదనే కోపంతో యజమానిని స్విమ్మింగ్ పూల్ నుంచి తీసుకొచ్చేసిందని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఆపదలో ఉన్న వ్యక్తిని రక్షించడానికి ఓ శునకం ఇలా చేయడం మొదటిసారి చూస్తున్నానంటూ మరికొంతమంది నెటిజన్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి

Follow Us