వైరల్ వీడియో: వధువును హాలులో నుంచి తీసుకువెళ్లిన వరుడిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
పెళ్లిళ్లకు సంబంధించిన అనేక వీడియో ప్రతినిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాంటి మరో వివాహ వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. వీడియోలో వరుడు చేసిన పనికి అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. పెళ్లి మండపం నుంచి వధువుతో పాటు వరుడు పారిపోతున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో చాలా వేగంగా దూసుకుపోతోంది. వరుడు చేసిన ఈ పనితో వివాహ వేడుకలో ఒక్కసారిగా విచిత్రం నెలకొంది. ఏం జరుగుతుందోనని ప్రేక్షకులు ఉత్కంఠకు లోనవుతున్నారు.
వీడియోలో…వివాహ వేడుక జరుగుతుండగా వరుడు డ్యాన్స్ చేసేందుకు లేచాడు. వధువు అతడి చేయి పట్టుకుని కూర్చోబెట్టింది. అయితే పెళ్లికొడుకు మళ్లీ లేచి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు అతను వధువు చేయి పట్టుకుని వారితో పాటు హాలు నుండి బయటకు పరుగెత్తాడు. ఈ సమయంలో పూజారి కూడా మంత్రాలు పఠిస్తూ కనిపిస్తాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలియక బంధువులు, స్నేహితులంతా అవాక్కయ్యారు. ఫన్నీగా ఉన్న ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.
ఈ వీడియోను ఫన్‌టాప్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా షేర్ చేసింది. వేడుక పూర్తికాకుండానే పెళ్లికూతురును పట్టుకుని వరుడు డ్యాన్స్‌కు దిగిన వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా మారింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి