ప్రజంట్ రీల్స్ ట్రెండ్ నడుస్తోంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ట్రెండింగ్ రీల్స్‌తో హల్ చల్ చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు రీల్స్ తీస్తున్నప్పుడు.. ఊహించని సందర్భాలు ఎదురవుతుంటాయి. పబ్లిక్ ప్లేస్‌లో రీల్స్ చేస్తుండగా.. ఆ చుట్టు పక్కల ఉండే వ్యక్తుల నుంచి అనుకోని రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. తాజాగా స్కూల్ పిల్లోడు.. షారుక్ ఖాన్ స్టైల్‌తో ఫోజ్ ఇస్తూ రీల్ చేద్దామనుకున్నాడు. ఆ ప్రయత్నం చేస్తుండగా ఊహించని ట్విస్ట్ ఎదురైంది.
స్కూల్ యూనిఫారంలో ఉన్న బాలుడు.. బ్యాగుతో ఒక మురికివాడలో నిలబడి ఉన్నాడు. స్కూల్ నుంచి వచ్చాక.. ఇంటి దగ్గర్లో బ్యాగ్ పక్కన పెట్టి… బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ట్రేడ్ మార్క్ స్టిల్ ఇవ్వబోయాడు. ఆ బాలుడి తల్లి గమనించి.. చెప్పు తీసి నెమ్మదిగా వచ్చి.. వాడికి ఒక్కటి ఇచ్చింది. దీంతో ఆ పిల్లోడు కంగుతిన్నాడు. ఎక్స్‌లో ‘ఘర్ కే కలేష్’ అనే ఖాతా ద్వారా షేర్ చేయబడిన ఈ వీడియోకు ఇప్పటివరకు 7 లక్షలకు పైగా వ్యూస్.. 6 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. కామెంట్ సెక్షన్‌లో కూడా ప్రజలు ఫన్నీగా స్పందిస్తున్నారు. “ప్లాట్ ట్విస్ట్, తల్లి సల్మాన్ ఖాన్ అభిమాని అని నేను అనుకుంటున్నాను” అని ఒకరు పేర్కొన్నారు.
వీడియో ఇక్కడ చూడండి –
Slipper Kalesh b/w Mom and Son over Giving SRK pose
pic.twitter.com/7FFzbkw3ze— Ghar Ke Kalesh (@gharkekalesh) August 10, 2024
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..