
ఈ మధ్య కాలంలో యువత విచ్చలవిడితనం పెరిగిపోయింది. సమాజంలో చుట్టూ ఏం జరుగుతోంది.. ఎవరు ఉన్నారనేది కూడా చూసుకోకుండా హద్దులు మీరుతున్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రవర్తనలో మార్పులు రావడం లేదు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ కోసం పబ్లిక్‌గానే రోమాన్స్‌కు వెనకాడటం లేదు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే అనేక వీడియోలు నెట్టింట వైరల్ అవుతునే ఉన్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తాజాగా వైరల్ అవుతున్న వీడియోలోని దృశ్యాలను బట్టి ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఓ జంట బైక్‌పై వెళ్తూ అత్యంత ప్రమాదకరంగా రొమాన్స్‌లో మునిగి తేలారు. యువకుడు బైక్ నడుపుతుండగా.. యువతి ముందు పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చొని అతడిని కౌగిలించుకుంది. అటుగా వెళ్తున్న కొందరు వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
వీడియో్ కాస్తా వైరల్‌గా మారడంతో పోలీసుల కంట పడింది. నోయిడా ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వెహిలక్ నెంబర్‌తో ఆ జంటను అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు, తోటి వాహనదారులను ఇబ్బందులకు గురి చేసినందుకు చర్యలు తీసుకున్నారు. రూ.53,500 భారీ జరిమానా విధించారు. బైక్‌ను సీజ్ కూడా చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
नोएडा में जान जोखिम में डाल एक्सप्रेसवे पर इश्क फरमाता दिखा प्रेमी जोड़ा,चलती बाइक पर रोमांस करते नजर आया कपल,ट्रैफिक पुलिस ने काटा 53,500 रुपये का चालान
@Uppolice @noidapolice pic.twitter.com/TH9r5NjA9m— RAVINDER JAINT (ABP NEWS) (@ravinderjaint) June 16, 2025