
Viral Video: కొందరు చేసే పనులకు ఎలా వస్తాయిరా..! సామీ ఇలాంటి ఐడియాలు అనక తప్పదు. కొంత మంది ఐడియాలు వింతగా ఉంటాయి. కానీ అవన్ని కూడా పనికొచ్చేవిగా ఉంటాయి. పనికి రాని వస్తువులతో కూడా ఆశ్చర్యపోయే ఐడియాలను సృష్టిస్తారు. చాలా మంది పనికి రాని వాషింగ్ మెషన్‌ను ఏం చేస్తారు.. పక్కన పారేస్తుంటారు. లేదా స్క్రాప్‌కు అమ్మేస్తుంటారు. కానీ పనికి రాని వాషింగ్ మెషిన్‌తో ఇలా కూడా చేస్తారనేది ఈ వీడియో చూస్తేనే అర్థమైపోతుంది. పక్కన పారేసిన వాషింగ్ మెషన్‌లో మొక్కలు నాటి అందరిని ఆశ్చపరుస్తున్నాడు ఓ వ్యక్తి.
పాత వాషింగ్ మెషీన్లని రీసైకిల్ చేసి, వాటిని గార్డెన్ ప్లాంటర్‌లుగా మార్చడం మంచి ఆలోచన. ఇలా చేయడం ద్వారా మీరు పాత వస్తువులను ఉపయోగించి మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దవచ్చు. అలాగే పర్యావరణానికి కూడా మేలు చేసినవారవుతారు.
ఇది కూడా చదవండి: Electricity Bill: ఇంట్లో స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేసిన ఒక రోజులోనే రూ. 1 లక్ష 70 వేల విద్యుత్ బిల్లు.. వీడియో వైరల్
పాడైపోయిన వాషింగ్ మెషిన్‌ను ముందుగా బాగా శుభ్రం చేసి డిటర్జెంట్, బురద, ఇతర మలినాలను తొలగించి అందులో మొక్కలు నాటాడు. మొక్కలు నాటడానికి ముందు డ్రమ్ లోపల నీరు నిలవకుండా ఉండటానికి డ్రైనేజీ రంధ్రాలు కూడా చేశాడు. అందులో మొక్కలు నాటి అందంగా తీర్చిదిద్దాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన ప్రతి ఒక్కరు ఆ వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. శభాష్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ వ్యక్తి పాడైపోయిన వాషింగ్ మెషిన్‌లో ఉసిరి చెట్టును ఎలా పెంచుతున్నాడో మీరే చూడండి. అంతేకాదు రకరకాల మొక్కలు సైతం పెంచుతున్నాడు. సో.. మీరు కూడా మీ ఇంట్లో పాడైపోయిన వాషింగ్ మెషిన్ డ్రమ్ ఉంటే ఇలా రకరకాల మొక్కలు నాటడం మర్చిపోకండి.
ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సంచలన నిర్ణయం.. జూలై 23 వరకు పాఠశాలలకు సెలవు!
ఇది కూడా చదవండి:Bank Holidays: వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఎందుకో తెలుసా..?