Viral Video: ముంబై ఆకాశంలో ఒక్కసారిగా ఉరుములతో కూడిన గర్జన… అంధేరీ మీదుగా దూసుకుపోయిన సుఖోయ్ జెట్‌లు

ముంబై వాసులు భారత వైమానిక దళం సుఖోయ్ Su-30MKI ఫైటర్ జెట్‌లు నగర ఆకాశం మీదుగా దూసుకుపోవడంతో అద్భుతమైన దృశ్యాన్ని చూశారు. ఆ దృశ్యాలు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. త్రిశూల్‌ ఎక్సర్‌సైజ్ లో భాగంగా భారత సైన్యం, నేవీ, వైమానిక దళం ఉమ్మడిగా విన్యాసాలు...

Viral Video: ముంబై ఆకాశంలో ఒక్కసారిగా ఉరుములతో కూడిన గర్జన... అంధేరీ మీదుగా దూసుకుపోయిన సుఖోయ్ జెట్‌లు
Sukoi Jets

Updated on: Nov 05, 2025 | 4:27 PM

ముంబై వాసులు భారత వైమానిక దళం సుఖోయ్ Su-30MKI ఫైటర్ జెట్‌లు నగర ఆకాశం మీదుగా దూసుకుపోవడంతో అద్భుతమైన దృశ్యాన్ని చూశారు. ఆ దృశ్యాలు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. త్రిశూల్‌ ఎక్సర్‌సైజ్ లో భాగంగా భారత సైన్యం, నేవీ, వైమానిక దళం ఉమ్మడిగా విన్యాసాలు చేపట్టాయి. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి.

ఆన్‌లైన్‌లో వేలాది మంది దృష్టిని ఆకర్షించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ యూజర్ @siddhant.rajadhyaksha షేర్ చేశారు. అతను సుఖోయ్ జెట్ ముంబై మీదుగా ఎగురుతున్నట్లు చిత్రీకరించాడు. “ముంబై ఆకాశంలో ఆ ఉరుము గర్జన విన్నారా? నిజంగా ఏమి జరుగుతుందో ఇక్కడ ఉంది అంటూ తన పోస్టుకు క్యాప్షన్‌ ఇచ్చాడు.

వీడియో చూడండి

భారత త్రివిద ధళాలు భూమి, సముద్రం, ఆకాశంలో భారీ విన్యాసాలు చేస్తూ తమ సంసిద్ధతను ప్రదర్శించాయి. ఈ పోస్ట్ త్వరగా వైరల్ అయ్యింది. ముంబై నగరం అంతటా ఉత్సాహాన్ని రేకెత్తించింది.

ఉరుములతో కూడిన గర్జనలు చాలా మందిని ఆశ్చర్యపరిచింది. చాలా మంది ముంబైకర్లు గర్వం, విస్మయం వ్యక్తం చేశారు. గర్జించే జెట్‌ల దృశ్యాలను విన్న లేదా చూసిన వారి కామెంట్లతో సోషల్ మీడియా నిండిపోయింది.