
సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వింతలు దర్శనమిస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా వైరల్ అవుతున్న వీడియో ఒకటి అందరనీ షాక్ అయ్యేలా చేస్తుంది. ఈ వీడియో వారణాసిలో కనిపించిన వింత దృశ్యాన్ని చూపుతుంది. బనారరస్‌లోని ఒక ఇంటి బయట కనిపించిన విచిత్రమైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది., అక్కడ చెట్టు నిండా కాయలు, పండ్లకు బదులుగా డైపర్లు చెట్టు నిండా వేలాడుతూ కనిపించాయి. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ శ్వేతా కటారియా ఈ ‘డైపర్ చెట్టు’ వీడియోను షేర్ చేశారు. వీడియో వేగంగా వైరల్ అవుతోంది.
వైరల్ రీల్స్‌లో శ్వేత కథనం వివరించారు. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ, ఇది డైపర్ చెట్టుగా మారింది. ఆ చెట్టు పక్కనే రెండంతస్తుల ఇల్లు ఉంది. ఈ ఇంటి బాల్కనీలో పిల్లల బట్టలు ఆరబెట్టి ఉండటం కూడా కనిపించింది. అది చూస్తుంటే.. అక్కడ చిన్న పిల్లలు ఉన్నారనే విషయం అర్థమవుతుంది. ఆ ఇంటి ముందు ఉన్న చెట్టు మీద డజన్ల కొద్దీ మురికి డైపర్లు వేలాడుతూ ఉన్నాయి. ఆ ఇంట్లోనే వారే వాటిని ఇలా చెట్టుపై విసిరేసినట్టుగా వీడియో చూస్తుంటే అర్థమవుతోంది.
వారి ఇంట్లో చెత్తబుట్టలు లేవా? వాళ్ళు తమ పిల్లలకు ఎలాంటి భవిష్యత్తు ఇస్తున్నారు? అంటూ శ్వేత కటారియా ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో రికార్డింగ్ సమయంలో ఆ ఇంట్లోని ఒక కుటుంబ సభ్యుడు కూడా అక్కడి ఖాళీ స్థలంలో చెత్తను విసిరేయడం కనిపిస్తుంది. డిస్పోజబుల్ డైపర్లు పర్యావరణంపై చూపే ప్రతికూల ప్రభావాన్ని శ్వేత నొక్కి చెబుతున్నారు. పునర్వినియోగపరచదగిన క్లాత్ డైపర్‌లను ఉపయోగించాలని వారికి సూచించారు. ఇవి చౌకైనవి, చర్మానికి మంచివి. పర్యావరణ అనుకూలమైనవి అని ఆమె వివరించారు.
ఈ వీడియోను రెడ్డిట్ r/IndianCivicFailsలో కూడా షేర్ చేశారు. అక్కడ ‘[NOT OC] THE TREE WHERE YOU GET NOT FRUITS BUT DIAPERS’ అనే క్యాప్షన్ ఉంది. సోషల్ మీడియా ఆ కుటుంబంపై మండిపడ్డారు. మనుషులకు రోజు రోజుకు బుద్ధి లేకుండా పోతుందంటూ చాలా మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఇది స్థానిక ప్రభుత్వ బాధ్యత అని కూడా అంటున్నారు.. చాలా మంది క్లాత్ డైపర్ల వాడకాన్ని సమర్థించారు. ఈ కాలనీలోని ప్రజలకు దుర్వాసన రావడం లేదా? స్థానికులంతా ఏం చేస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోలేదా అంటూ ప్రశ్నించారు. అలాంటి వారిని సామాజికంగా బహిష్కరించడం అవసరం అని కూడా చాలా మంది వ్యాఖ్యనించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..