
కొన్ని దొంగతనాలు ఫన్నీగా, అవాక్కయ్యేలా ఉంటాయి. సొమ్ము పోయి ఒకడు ఏడుస్తుంటే చూసే జనాలకు మాత్రం తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. అలాంటి వీడియోనే ఒకటి తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. ఎదుటివారి వీక్‌నెస్‌ను పసిగట్టి చలా ఈజీగా మొక్కకు అంటు కట్టినట్లు పద్దతిగా దొంగతనాలు చేస్తుంటారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఫ్రీ వైఫ్ అని బోర్డు ఉండడం చూసి స్కాన్ చేయాలని వెళ్లాడు. చివరకు అక్కడి జరిగింది చూసి నెటిజన్స్ అవాక్కయ్యారు.
సాధారణంగా పట్టణాలు, నగరాల్లో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి ప్రాంతాల్లో ఫ్రీ వైఫై సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఫ్రీ వైఫై కదా అని ఎక్కడ పడితే అక్కడ కనెక్ట్ చేసుకుని వాడి నష్టపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఫ్రీ వైఫై పేరుతో సైబర్ కేటుగాళ్లు ఖాతాలను ఖాళీ చేసిన సంఘటనలు కూడా అనేకం వెలుగులోకి వచ్చాయి. అయితే తాజాగా, ఓ తమాషా సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
వీడియో ప్రారంభంలో ఫ్రీ వైఫై అని ఓ చోట బోర్డుపై క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. అటుగా వెళ్లిన ఓ వ్యక్తి.. ఆ క్యూఆర్ కోడ్ చూసి దగ్గరికి వెళ్లాడు. ఫ్రీ వైఫై అని ఎంతో సంబరపడి తన ఫోన్‌తో స్కాన్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఇలా స్కాన్ చేయగానే అలా ఆ పక్కనే నక్కి ఉన్న దొంగ అతడి ఫోన్ లాక్కెళ్లిపోతాడు. దీంతో అప్పటిదాకా సంతోషంగా ఉన్న ఆ వ్యక్తి సడన్‌గా షాక్ అయ్యాడు. అయితే ఇది వీడియో కోసం చేసినట్లుగానే అనిపిస్తున్నప్పటికీ అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ‘ఫ్రీ వైఫై పేరుతో చోరీ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’.. అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.