Viral video: తెల్లటి కాలిఫ్లవర్‌లో ఏదో కదులుతోంది.. కట్‌చేస్తే నల్లటి ఆకారం అమాంతంగా..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి వర్షాకాలంలో మార్కెట్ నుండి ఒక కాలీఫ్లవర్‌ పువ్వును కొని ఇంటికి తీసుకువచ్చాడు. అతను ఈ పువ్వును శుభ్రం చేసి, కట్‌ చేసి వంటచేయాలని అనుకున్నాడు. కానీ ఈ పువ్వులో ప్రాణాంతక ప్రమాదం నక్కి ఉందని అతనికి తెలియదు. ఆ వ్యక్తి పువ్వును విప్పిన వెంటనే

Viral video: తెల్లటి కాలిఫ్లవర్‌లో ఏదో కదులుతోంది.. కట్‌చేస్తే నల్లటి ఆకారం అమాంతంగా..
Cauliflower

Updated on: Sep 17, 2025 | 8:33 AM

కూరగాయలు, ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే, వర్షాకాలంలో ఆకుకూరలు ఎక్కువగా తినకూడదని అంటూ ఉంటారు. అంతేకాదు.. వర్షాకాలంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమని పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. ఈ సీజన్‌లో విషపూరిత పాములు ఎక్కడైనా ఆశ్రయం పొందడానికి వస్తాయి. ఎందుకంటే నీరు ప్రతిచోటా పేరుకుపోతుంది. అందువల్ల అవి పొడి ప్రదేశాలను వెతుక్కుంటూ వెళ్తాయి. మీరు ఊహించని ప్రదేశాలలో దాక్కుంటాయి. అలాంటి ఒక కేసుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఎవరూ ఊహించలేని, ఆలోచించలేని ప్రదేశంలో ఒక పాము దాగి ఉంది..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి వర్షాకాలంలో మార్కెట్ నుండి ఒక కాలీఫ్లవర్‌ పువ్వును కొని ఇంటికి తీసుకువచ్చాడు. అతను ఈ పువ్వును శుభ్రం చేసి, కట్‌ చేసి వంటచేయాలని అనుకున్నాడు. కానీ ఈ పువ్వులో ప్రాణాంతక ప్రమాదం నక్కి ఉందని అతనికి తెలియదు. ఆ వ్యక్తి పువ్వును విప్పిన వెంటనే దాని నుండి ఒక పాము బయటకు వచ్చింది. అది ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సంఘటన చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. వర్షాకాలంలో కాలీఫ్లవర్ వంటి కూరగాయలు తినకూడదని పెద్దలు ఇచ్చిన సలహా ఎంత సరైనదో ఈ ఘటన రుజువు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో దాదాపు రెండు సంవత్సరాల క్రితం నాటిదిగా తెలిసింది. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆ వ్యక్తి కాలీఫ్లవర్ తెరిచినప్పుడు దానిలో నుండి ఒక చిన్న పాముపిల్ల బయటకు వస్తుంది. ఆ పాము వెంటనే నేలపై పడి వేగంగా పరుగెత్తడం ప్రారంభిస్తుంది. ఈ వీడియోను sharda.raghav అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా షేర్ చేసింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను తెలియజేశారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల పలువురు సలహాలు, సూచనలు కూడా చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..