Viral Video: ఈ అక్క ప్లేట్‌లో ఉన్న చికెన్ ముక్కను ఏం చేసిందో చూస్తే.. నోరెళ్ల బెట్టాల్సిందే..
పెళ్లిళ్లు, విందు భోజనాలకు సంబంధించిన వార్తలు అనేకం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. విందు అనగానే చికెన్, మటన్, ఫిష్ వంటకాలు సర్వసాధారణం. అప్పుడప్పుడు ఆ విందులో ఎవరికైనా ముక్క దక్కలేదో..ఇక ఉంటుంది..! రచ్చరంబోలే.. విందులో మటన్ ముక్క దక్కలేదని నానా హంగామా చేస్తుంటారు కోందరు. పెళ్లిలో మటన్ సరిగా వేయలేదనే గొడవలు తరచూగా చూస్తూనే ఉంటాం. అలాగే, రెస్టారెంట్లు, హోటళ్లలో కూడా చికెన్ పీస్‌లు తక్కువగా వచ్చాయని కొట్టుకున్న ఉదాంతలు కూడా అనేక వెలుగులోకి వచ్చాయి. వీటన్నింటికీ భిన్నమైన వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతోంది. అది చూస్తే మీ అభిప్రాయం ఏంటో చెప్పండి..

ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఏదో ఒక ప్రత్యేకమైన వీడియో కనిపిస్తుంది. ఈ వీడియోలలో కొన్ని ప్రజల దృష్టిని ఆకర్షిస్తుండగా, మరికొన్ని ఆలోచింపజేస్తాయి. ఈ క్రమంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఒక వీడియో కనిపించింది. ఈ వీడియో ఒక వివాహ విందులో భోజనం చేయడానికి వచ్చిన మహిళకు సంబంధించినది.
వైరల్ వీడియో ఏదో విందుకార్యక్రమానికి సంబంధించినదని అర్థమవుతుంది. ఎందుకంటే.. అక్కడ ఫంక్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఒక మహిళ భోజనం చేసేందుకు టేబుల్ ముందు కూర్చుని ఉంది.. డిన్నర్ చేయడానికి వచ్చిన ఆ మహిళ ముందు టేబుల్‌పై ఫుడ్ సప్లై చేసి ఉంది. ఇంతలోనే ఆమె అందరినీ ఆశ్చర్యపోయే పనిచేసింది..ఆమె చేసిన ఫన్నీ సీన్ చూస్తే అందరూ నోరెళ్ల బెడతారు. చూస్తుంటే.. ఆమె మొదటిసారి ఇలాంటి ఆహారం తింటున్నట్లుగా అనిపిస్తుంది. ఆమె ప్లేట్‌లో వడ్డించిన చికెన్ లెగ్‌పీస్ తీసుకొని బ్యాగ్‌లో పెట్టేసుకుంది.
अब पता चला पापा के परियां अपने साथ हमेशा पर्स लेकर क्यों चलती है,विडियो देखें मज़ा आ जाएगा। pic.twitter.com/SX7AYyBipP
— aejaz kousar (@MDaejazAlam1) September 15, 2025
వీడియోలో, ఆ మహిళ మొదట భోజనం చేసేందుకు కూర్చుంది. కానీ, ఆమెకు వడ్డించిన ప్లేట్ బాగా రోస్ట్ అయిన చికెన్ లెగ్ పీస్ ఉంది.. దాంతో ఆమె వెంటనే చికెన్ లెగ్ తీసుకొని టిష్యూ పేపర్‌లో చుట్టి నేరుగా తన పర్సులో వేసుకుంటుంది. కానీ, ఇదంతా ఎవరో రికార్డ్ చేశారో, లేదంటే సీసీ కెమెరాలో రికార్డైందో తెలియదు గానీ, సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది. ఆమె ఎందుకు చేస్తుందో తెలియక ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. వీడియో చూసిన తర్వాత చాలా మంది, ఆ మహిళ తన ఆహారం మొత్తం తినలేకపోతుందని, అందుకే ఆమె చికెన్ ముక్కను పేపర్‌లో చుట్టి ఇంటికి తీసుకెళ్లిందని చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




