Viral Video: ఫైథాన్‌తోనే గేమ్సా.. సరదాగా ఎత్తుకుంటే క్షణాల్లోనే చుట్టేసింది.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

Python Shocking Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అయితే.. మరికొన్ని వీడియోలు

Viral Video: ఫైథాన్‌తోనే గేమ్సా.. సరదాగా ఎత్తుకుంటే క్షణాల్లోనే చుట్టేసింది.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
Snake

Updated on: Dec 24, 2021 | 8:35 AM

Python Shocking Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అయితే.. మరికొన్ని వీడియోలు భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే వైరల్ అవుతోంది. సాధారణంగా పాము పేరు వినగానే చాలామందికి పరిస్థితి దిగజారిపోతుంది. పామును దూరంగా చూస్తేనే.. చాలామంది వణికిపోతుంటారు. అయితే ఓ వ్యక్తి సరదాగా ఓ పెద్ద కొండచిలువను తన భుజంపై వేసుకొని మోశాడు. దీని తర్వాత ఏం జరిగిందో చూస్తే.. అందరు షాకవుతారు. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా యూజర్లు షాక్ అవుతున్నారు. ఇది పిచ్చి అని కొందరంటుంటే.. పాములు.. మనుషులకు ఎప్పటికీ స్నేహితులు కావు అంటు మరికొందరు అంటున్నారు.

వైరల్ వీడియో క్లిప్‌లో.. ఒక యువకుడు తన భుజంపై పెద్ద పసుపు రంగు కొండచిలువను మోసేందుకు ప్రయత్నిస్తున్నాడు. పాము ఎంత బరువుగా, ప్రమాదకరంగా ఉందో మీరు చూడవచ్చు. పామును భుజంపై వేసుకున్న తర్వాత ఆ కుర్రాడి ముఖంలో చిరునవ్వు కనిపించింది. కానీ మరుక్షణమే.. అతనికి ఏమి జరుగుతుందో కూడా అర్ధం కాలేదు. సాధారణంగా ఫైథాన్ పాములు.. చుట్టుముట్టి చంపుతాయన్న విషయం మనందరికీ తెలిసిందే. సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది. ఫైథాన్‌ను భుజంపై వేసుకోగానే.. యువకుడిని చుట్టుముట్టడం ప్రారంభించింది. కొద్దిసేపటికే యువకుడి పరిస్థితి విషమించడం ప్రారంభించింది. ఇది చూసిన సమీపంలోని వ్యక్తులు కొండచిలువ బారి నుంచి అతన్ని విడిపించే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యం నిజంగా ఆందోళన కలిగించింది.

వైరల్ వీడియో.. 


కొన్ని సెకన్ల ఈ షాకింగ్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో nature27_12 అనే ఖాతా షేర్ చేసింది. దీనిని కొన్ని గంటల్లోనే 2 వేల మంది లైక్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆందోళనతోపాటు ఆశ్చర్యపోతున్నారు. పాముతో గేమ్స్ ఆడటం కరెక్ట్ కాదంటూ సూచిస్తున్నారు. ఒక యూజర్ వ్యాఖ్యానిస్తూ.. పాములు మనుషులకు ఎప్పటికీ స్నేహితులు కాలేవు.. ఇలా చేయడం పిచ్చి అంటూ రాశాడు.

Also Read:

Guns on Road: దడ పుట్టిస్తోన్న గన్‌ కల్చర్‌.. ఇది అమెరికాలో కాదు.. మరెక్కడో తెలుసా..

83 Movie Review: 83 మ‌న చ‌రిత్ర‌… త‌ర‌త‌రాలు గ‌ర్వంగా చెప్పుకునే ఘ‌న‌చ‌రిత్ర‌!

Loading...
Unable to load recommendations.
Follow Us