Viral Video: ముచ్చ కోల్లాగె ముందు మోకరిల్లిన చిరుతలు… తోక ముడుచుకుని పరుగో పరుగు

సాధారణంగా సింహాలు, పలులు, చిరుతలే అడవికి రారాజులు. అవి కనిపిస్తే చాలు ఎంత పెద్ద జంతువైనా జడుసుకోవాల్సిందే. ఇక అడవిలో తప్పిపోయిన ఆవులు, ఎద్దులైతే వాటికి ఆహారంగా మారాల్సిందే. అలాంటిది రెండు చిరుతలను ఓ ఒంటరి ఎద్దు తరిమిన దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ వీడియో...

Viral Video: ముచ్చ కోల్లాగె ముందు మోకరిల్లిన చిరుతలు... తోక ముడుచుకుని పరుగో పరుగు
Jaguar And Bull

Updated on: Jun 25, 2025 | 8:37 PM

సాధారణంగా సింహాలు, పలులు, చిరుతలే అడవికి రారాజులు. అవి కనిపిస్తే చాలు ఎంత పెద్ద జంతువైనా జడుసుకోవాల్సిందే. ఇక అడవిలో తప్పిపోయిన ఆవులు, ఎద్దులైతే వాటికి ఆహారంగా మారాల్సిందే. అలాంటిది రెండు చిరుతలను ఓ ఒంటరి ఎద్దు తరిమిన దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్స్‌ను షాకింగ్‌కు గురి చేస్తుంది. ఈ వీడియోలో రెండు జాగ్వార్‌లు ఎద్దు ముందు మోకరిల్లినట్లు కనిపిస్తాయి. సాధారణంగా జాగ్వార్‌ల వంటి క్రూరమైన వేట జంతువుల నుంచి తన ప్రాణాలను కాపాడుకునే ఎద్దు ఎవరూ ఊహించని పని చేసింది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది.

వైరల్ వీడియోలో, రెండు జాగ్వార్‌లు ఒక పెద్ద ఎద్దుకు అడ్డం తిరుగుతాయి. ఎద్దు వస్తున్న దారిలో నిల్చుని దాన్ని అడ్డుకుంటూ నిలబడి ఉండటం కనిపిస్తుంది. క్లిప్‌ను చూసినప్పుడు, మొదట జాగ్వార్‌లు ఎద్దును తేలికగా తీసుకున్నట్లు అనిపిస్తుంది, కానీ అది వారి వైపు వేగంగా కదిలిన వెంటనే, రెండు జాగ్వార్‌లు భయపడతాయి. అప్పుడు మీరు ఊహించలేని విధంగా ఆ జాగ్వార్‌లు వాటి తోకలను ముడుచుకుని అక్కడి నుండి దూరంగా వెళ్లిపోతాయి. ఆ తర్వాత భయంతో దట్టమైన అడవి వైపు పారిపోతాయి.

దాదాపు 28 సెకన్ల ఈ క్లిప్ ఇక్కడ ముగుస్తుంది. ఈ దృశ్యాన్ని చూసిన ప్రజలు రెండు జాగ్వార్లు ఎద్దును చూసి ఎలా భయపడ్డాయో ఆశ్చర్యపోతారు. ఒక యూజర్ అడవిలో జాగ్వార్ ఉనికి కూడా ఎద్దు వల్ల ప్రమాదంలో ఉంది అంటూ పోస్టు పెట్టాడు. . “జాగ్వార్ వేరే మూడ్‌లో ఉందనుకుంటా, లేకుంటే ఇదే ఆ ఎద్దు చివరి రోజు అయ్యేది” అని మరొకరు రాశారు. “ఈ ఎద్దు యాంటీ రోమియో స్క్వాడ్ నుండి వచ్చి ఉండాలి” అని మరొకరు అన్నారు.

వీడియో చూడండి: