Viral Video: ఇప్పటి వరకూ డ్రోన్ల ను నిఘాకు మాత్రమే ఉపయోగిస్తారని తెలుసు.. అయితే హై టెన్షన్ వైర్‌పై ఇరుక్కున్న పక్షిని రక్షించడానికి పోలీసులు డ్రోన్‌ను కూడా ఉపయోగిస్తారని ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ అవుతుంది. టీవల, పెరూ దేశంలోని బర్రాంకాలో పోలీసు అధికారుల బృందం హైటెన్షన్ వైర్ నుండి వేలాడుతున్న పావురాన్ని చూశారు. అది అప్పటికి ఇంకా ప్రాణాలతో ఉండడంతో రెస్క్యూ టీమ్ ఆ పావురాన్ని ప్రాణాలతో కాపాడాలని అనుకున్నారు. అత్యంత ఎత్తులో ఉన్న హై టెన్షన్ వైర్ల నుంచి పావురాన్ని రక్షించడానికి చేపట్టే రెస్క్యూ ఆపరేషన్ అంత సులభం కాదని తెలుసు. దీంతో ఇద్దరు అధికారులు భిన్నంగా ఆలోచించారు. ఫోటోగ్రాఫర్లు, నిఘా ఏజెన్సీలు, పోలీసులు తరచుగా ఉపయోగించే సాంకేతికతను ఉపయోగించి పావురాన్ని రక్షించాలని నిర్ణయించుకున్నారు.
స్థానికులు గత 12 గంటల నుంచి పావురం విద్యుత్ తీగపై ఇరుక్కుపోయిందని పోలీసు అధికారులకు చెప్పారు. అయితే పావురాన్ని రక్షించాలంటే.. అగ్నిమాపక శాఖ సహాయం లేకుండా ఎత్తుకు చేరుకోవడం దాదాపు అసాధ్యం.. దీంతో ఇద్దరు అధికారులు తమ మెదడుకు పదును పెట్టి.. డ్రోన్‌కు కత్తిని జత చేసి హై-టెన్షన్ వైర్ వద్దకు పంపారు. దాని ఫుటేజ్ లో పక్షి రెక్కలు ఊపుతూ తలక్రిందులుగా వేలాడుతోంది. ఆ వైర్ నుండి తనను తాను విడిపించుకోవడానికి అది కష్టపడుతున్నట్లు కనిపించింది. డ్రోన్ కెమెరా తీసిన క్లోజప్ షాట్ లో పావురం కాలు ని ఓ తాడు చుట్టుకున్న.. అది విద్యుత్ వైర్లకు రిలేటెడ్ గా ఉన్నట్లు కనిపించింది. దీంతో డ్రోన్ కు చిన్నపాటి నైఫ్ ను కట్టి.. పావురం కాలుకు చుట్టుకున్న తాడుని కట్ చేసే విధంగా డ్రోన్ ను కదలించారు. అదే సమయంలో పావురం సురక్షితంగా కిందపడేలా స్థానికులు షీట్స్ ఏర్పాటు చేశారు.
డ్రోన్ సాయంతో తాడు కట్ చేయడానికి పావురం సురక్షితంగా బెడ్ షీట్స్ మీద పడింది. వెంటనే రెస్క్యూ టీమ్ ఆ పావురాన్ని స్తానికంగా ఉన్న జంతువుల ఆశ్రమానికి తీసుకుని వెళ్లారు. తగిన చికిత్సనందించారు. అయితే రెస్క్యూ టీమ్ పావురాన్ని కాపాడడానికి చేసిన ప్రయత్నం.. ఆలోచనపై నెటిజన్లు ప్రశంసలను కురిపిస్తున్నారు. మీరు కూడా ఆ వీడియో పై ఓ లుక్ వేయండి..
Also Read: పాల పిట్ట దర్శనంతో ముగిసే దసరా ఉత్సవాలు.. ఎందుకు దర్శిస్తారంటే..