Viral Video: టికెట్‌ లేకుండా.. విమానంలో దూరిన పావురం… టేకాఫ్‌కు ముందు ఇండిగోలో గందరగోళం

ఇండియాలో ఇండిగో విమానాలు ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. వందలాది విమానాలు రద్దు కావడంతో ఎయిర్‌పోర్టుల్లోనే వేలాది మంది చిక్కుకున్నారు. ఇండిగో మీద ప్రయాణికులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఈ క్రమంలో ఓ పావురం ఇండిగో విమానంలోకి దూరి కలకలం రేపింది. దీనికి సంబంధించిన...

Viral Video: టికెట్‌ లేకుండా.. విమానంలో దూరిన పావురం... టేకాఫ్‌కు ముందు ఇండిగోలో గందరగోళం
Pigeon In Indigo Flight

Updated on: Dec 08, 2025 | 5:30 PM

ఇండియాలో ఇండిగో విమానాలు ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. వందలాది విమానాలు రద్దు కావడంతో ఎయిర్‌పోర్టుల్లోనే వేలాది మంది చిక్కుకున్నారు. ఇండిగో మీద ప్రయాణికులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఈ క్రమంలో ఓ పావురం ఇండిగో విమానంలోకి దూరి కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

బెంగళూరు నుండి వడోదరకు వెళ్లే ఒక సాధారణ ఇండిగో విమానం టేకాఫ్‌కు ముందు క్యాబిన్‌లోకి ఒక పావురం ఎగిరడంతో అసాధారణ అంతరాయం కలిగింది. ఈ ఘటన ప్రయాణీకులను, సిబ్బందిని ఆశ్చర్యపరిచింది. సిబ్బంది, కొంతమంది ప్రయాణికులు దానిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆ పక్షి మాత్రం సీట్లపై ఎగురుతూ అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వీడియో చూడండి:


వైరల్‌ వీడియోను వేలాది మంది వీక్షించారు. నెటిజన్స్‌ లైక్స్‌, షేర్స్‌ చేస్తూ ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు.