Viral Video: ఆ చెట్టు లేకుంటే పరిస్థితి ఏంటి..ఊహించుకోండి..! వాహనానికి హఠాత్తుగా దెయ్యం పట్టినట్లుందిగా!

వాన రాకడ, ప్రాణం పోకడ ఎవరికీ తెలియదంటారు. అలాగే ప్రమాదాలు కూడా ఎప్పుడు ఎటు నుంచి వస్తాయో కూడా ఎవరూ ఊహించలేరు. ముఖ్యంగా హఠాత్తుగా జరిగే రోడ్డు ప్రమాదాలు రెప్పపాటులో ప్రాణాలను బలిగొంటాయి. అలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే...

Viral Video: ఆ చెట్టు లేకుంటే పరిస్థితి ఏంటి..ఊహించుకోండి..! వాహనానికి హఠాత్తుగా దెయ్యం పట్టినట్లుందిగా!
Tourist Vehicle Accident

Updated on: Dec 27, 2025 | 5:11 PM

వాన రాకడ, ప్రాణం పోకడ ఎవరికీ తెలియదంటారు. అలాగే ప్రమాదాలు కూడా ఎప్పుడు ఎటు నుంచి వస్తాయో కూడా ఎవరూ ఊహించలేరు. ముఖ్యంగా హఠాత్తుగా జరిగే రోడ్డు ప్రమాదాలు రెప్పపాటులో ప్రాణాలను బలిగొంటాయి. అలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ విహార యాత్రలో అంతా బాగుందనుకునే సమయంలో అనుకోని ప్రమాదం పర్యాటకులను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది.

వైరల్ క్లిప్‌లో హిమాచల్ ప్రదేశ్‌లోని డల్హౌసీలోని ప్రసిద్ధ పంచపుల ప్రదేశంలో ఒక పర్యాటక వాహనం వెనక్కి దొర్లడం కనిపిస్తుంది. పలువురు పర్యాటకులు తమ బ్యాలెన్స్‌ను కోల్పోయి గాయపడ్డారని చెబుతున్నారు. అయితే, ఆ వాహనం లోయలో పడిపోకుండా ఓ చెట్టు రక్షించడం వీడియోలో కనిపిస్తుంది. ఈ ఘటన డిసెంబర్ 17, బుధవారం జరిగింది. డల్హౌసీ కొండ రోడ్డుపై పర్యాటక వాహనం వెనక్కి దొర్లడంతో ప్రయాణికులు తమను తాము రక్షించుకోవడానికి బయటకు దూకడం వీడియోలో కనిపిస్తుంది. అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌ కావడంతో వీడియో వెలుగులోకి వచ్చింది

ఈ ఘటనలో పెద్ద ప్రమాదం తృటిలో తప్పినప్పటికీ, కొందరు పర్యాటకులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెట్టింటిలో సంచలనంగా మారిన ఈ వీడియో లక్షల వ్యూస్‌ను సంపాధించింది. అనేక మంది నెటిజన్స్‌ తమ రియాక్షన్స్‌తో కామెంట్స్‌ బాక్స్‌ను నింపేస్తున్నారు.

వీడియో చూడండి: