Viral Video: అయ్యో పాపం.. ఆకలితో ఉన్న చిరుతపులి.. వీధి కుక్కలా కష్టపడుతోంది..! షాకింగ్‌ వీడియో వైరల్‌

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియో అందరినీ షాక్‌ అయ్యేలా చేస్తుంది. ఎందుకంటే.. ఇలాంటి సీన్‌ గతంలో ఎప్పుడూ చూసి ఉండరు.. ఒక చిరుతపులి మనుషులు పడవేసిన చెత్తలో ఆహారం వెతుక్కుంటూ కనిపిస్తుంది. ఈ దృశ్యం ఎంత బాధాకరమైనది.. ఇది మన పర్యావరణం పరిస్థితులు, వాస్తవికతను బయటపెడుతుంది. వీధి కుక్కలు ఇలా చెత్తలో తిరగటం చూశాం. కానీ, చిరుత పులి చెత్తలో ఆహారం కోసం తిరగటం ప్రతి ఒక్కిరినీ కదిలించి వేసింది.

Viral Video: అయ్యో పాపం.. ఆకలితో ఉన్న చిరుతపులి.. వీధి కుక్కలా కష్టపడుతోంది..! షాకింగ్‌ వీడియో వైరల్‌
Leopard Seen Searching Food In Garbage

Updated on: Oct 19, 2025 | 8:21 PM

సోషల్ మీడియాలో ఒక వీడియో ప్రజల హృదయాలను కదిలించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన ఈ వీడియోలో మనుషులు పడవేసిన చెత్తలో ఆహారం కోసం వెతుకుతున్న చిరుతపులి కనిపిస్తుంది. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరినీ కదిలించింది. ప్రతి ఒక్కరినీ ఎంతగానో బాధపెడుతోంది. ఇది మన పర్యావరణం వాస్తవికతను చూపెడుతోంది. ఒకప్పుడు అడవిలో వేటాడే జంతువులు ఇప్పుడు మనుషుల చెత్తలో మనుగడ కోసం కష్టపడుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోలో ఆకలితో అలమటిస్తూ చెత్త కుప్పలో ఆహారం కోసం వెతుకుతున్న చిరుతపులి కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు. అడవుల సరిహద్దులు తగ్గిపోతున్నాయని, మానవ నిర్లక్ష్యం జంతువుల ప్రాణాలను బలిగొంటోందని జంతుప్రేమికులు, వన్యప్రాణి సంరక్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు చెట్, నదుల మధ్య స్వేచ్ఛగా తిరిగే ఈ జంతువులు ఇప్పుడు చెత్తలో మిగిలిపోయిన ఆహారాన్ని వెతుక్కోవాల్సి వచ్చిందంటూ వాపోయారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ శివన్ష్ షా (@wildlife.shiv3) చిత్రీకరించారు. వీడియోతో పాటు, అతను ఇలా వ్రాశాడు, చెత్తలో ఉన్న చిరుతపులి దాని ఇష్టానుసారం కాదు, కానీ, మానవ చర్యల వల్ల ఇక్కడ సంచరించవలసి వస్తుంది. ప్రతి ప్లాస్టిక్ ముక్క మన అజాగ్రత్త ఫలితం. వన్యప్రాణులను వాటి ఇళ్ల నుండి దూరంగా నెట్టివేస్తోంది. ప్రకృతిని చెత్త కుప్పలా చూసుకోవడం మానేసి, చెత్తను బాధ్యతాయుతంగా పారవేద్దాం.”

పెరుగుతున్న వ్యర్థాలు, తగ్గుతున్న అడవులు

భారతదేశంలో వ్యర్థాల నిర్వహణ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. పెరుగుతున్న నగరాలు, విస్తారమైన పల్లపు ప్రాంతాలు, కుంచించుకుపోతున్న అడవులు జంతువుల సహజ ఆవాసాలను నాశనం చేశాయి. ఇప్పుడు చిరుతపులులు మాత్రమే కాదు, ఏనుగులు, జింకలు, కోతులు వంటి జంతువులు కూడా ఆహారం కోసం చెత్త కుప్పల గుండా తిరుగుతున్నాయి. ఈ దృశ్యం కేవలం వీడియో కాదు, వన్యప్రాణుల సంరక్షణ వైఫల్యానికి స్పష్టమైన ఉదాహరణ.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..