Viral Video: పోలీసులకే చుక్కలు చూపించాడుగా.. నెట్టింట్లో నవ్వులు పూయిస్తోన్న వీడియో..

|

Jun 02, 2022 | 6:11 AM

రోడ్డు మీద పోలీసులను చూడగానే కొంతమంది కంగారు పడుతుంటారు. కానీ, కొంతమంది మాత్రం చాలా తెలివిగా తప్పించుకుని, రక్షక భటులకే మస్కా కొట్టేస్తుంటారు. ఇది కూడా అలాంటి కోవకే చెందింది.

Viral Video: పోలీసులకే చుక్కలు చూపించాడుగా.. నెట్టింట్లో నవ్వులు పూయిస్తోన్న వీడియో..
Viral Video News
Follow us on

సోషల్ మీడియాలో వైరల్ వీడియోల(Viral Video) హవా కొనసాగుతూనే ఉంది. ఇందులో ఫన్నీ వీడియోలే ఎక్కువగా అలరిస్తుంటాయి. ఇవి నెటిజన్లకు బాగా ఆకట్టుకుంటాయి. తాజాగా ఇలాంటి కోవకే చెందిన ఓ వీడియో వచ్చి చేరింది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఓ బైక్ రైడర్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇందులో పోలీసులను తప్పించేందుకు చేసిన ప్రయత్నాలే నవ్విస్తున్నాయి. చాలా మంది వ్యక్తులు ఈ క్లిప్‌ని ఫన్నీగా ఉందంటూ షేర్ చేస్తున్నారు.

రోడ్డు మీద పోలీసులను చూడగానే కొంతమంది తెగ కంగారు పడిపోతారు. ఎక్కడ ఆపి, పత్రాలు చూపించమంటూ అడ్డుపడుతుంటారని భయపడుతుంటారు. అన్ని సక్రమంగా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. కానీ, సరైన పత్రాలు లేకుంటే మాత్రం ఇబ్బందులు పడాల్సిందే. చాలా కేసుల్లో ఇలాంటి వాళ్లని పోలీసులు అరెస్ట్ చేస్తారు అదే ఫైన్‌లు వేస్తుంటారు. కానీ ఒక్కోసారి కొంతమంది వాహనదారులు పోలీసులకు చుక్కలు చూపిస్తుంటారు. ఇలాంటి కోవకే చెందింది ఈ వీడియో. ఇందులో ఓ కుర్రాడు పోలీసులకు మస్కా కొట్టి, తప్పించుకోవడం కనిపిస్తుంది. వాళ్ల నుంచి తప్పించుకుని, చాలా స్పీడ్‌గా వెళ్లిపోవడం వీడియోలో చూడొచ్చు.

బైక్ రైడర్ వెనుక పోలీసులు ఉన్నారని, వారిని తప్పించుకుని పారిపోవడాన్ని వీడియోలో మీరు చూడొచ్చు. వీటన్నింటి మధ్య ఒక మలుపు వస్తుంది. అక్కడ బైక్ రైడర్ స్పీడ్ తగ్గించి, లొంగిపోవాలనుకుంటున్నట్లు చూపించడానికి ప్రయత్నిస్తాడు. కానీ, పోలీసులు బైక్ నుంచి దిగి అతని వద్దకు వెళ్ళగానే, చాలా వేగంగా అక్కడి నుంచి తప్పించుకుంటాడు. లక్కీగా సదరు వ్యక్తి తప్పించుకునే విధానం అతనికి ప్రమాదకరంగా మారలేదు. ఈ వీడియో ‘ఘంటా’ అనే పేజీ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వార్తలు రాసే వరకు లక్షలాది మంది చూశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..