Viral Video: పండగ పూట స్విగ్గీలో వెజ్‌ బిర్యాని ఆర్డర్‌ చేసిందట… తీరా తెరిచి చూసి షాకయిన యువతి

ఇప్పుడంతా ఆన్‌లైన్‌ యుగం. ఏం కావాలన్నా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే చాలు.. కూర్చున్న చోటికే కోకుకుంది వచ్చేస్తుంది. అయితే ఓ యువతికి మాత్రం ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ కోలుకోలేని షాక్‌ ఇచ్చింది. నోయిడాలోని బిస్రాఖ్ ప్రాంతానికి చెందిన ఒక యువతి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ద్వారా వెజిటేరియన్ బిర్యానీ ఆర్డర్ చేసింది. అయితే వచ్చిన పార్సల్‌ తెరిచి చూస్తే అందులో...

Viral Video: పండగ పూట స్విగ్గీలో వెజ్‌ బిర్యాని ఆర్డర్‌ చేసిందట... తీరా తెరిచి చూసి షాకయిన యువతి
Veg Biryani Cheating

Updated on: Apr 07, 2025 | 5:05 PM

ఇప్పుడంతా ఆన్‌లైన్‌ యుగం. ఏం కావాలన్నా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే చాలు.. కూర్చున్న చోటికే కోకుకుంది వచ్చేస్తుంది. అయితే ఓ యువతికి మాత్రం ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ కోలుకోలేని షాక్‌ ఇచ్చింది. నోయిడాలోని బిస్రాఖ్ ప్రాంతానికి చెందిన ఒక యువతి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ద్వారా వెజిటేరియన్ బిర్యానీ ఆర్డర్ చేసింది. అయితే వచ్చిన పార్సల్‌ తెరిచి చూస్తే అందులో చికెన్ బిర్యానీ ఉంది. దీంతో ఏడుసుకుంటూ తనకు జరిగిన మోసాన్ని వీడియో రూపంలో విడుదల చేసింది. ఈ ఘటన ఏప్రిల్ 4న జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

నవరాత్రి పండగ సందర్భంగా చాలా మంది శాఖాహార నియమాన్ని పాటిస్తున్న సందర్భంగా రెస్టారెంట్ ఉద్దేశపూర్వకంగా తనకు చికెన్ బిర్యానీ పంపిందని ఆ మహిళ వీడియోలో ఆరోపించింది. తాను ‘స్వచ్ఛమైన శాఖాహారిని’ అని చెప్పుకుంది. ఆ పార్సిల్‌లో ఆహారం రెండు మూడు చెంచాలు తిన్న తర్వాతనే అందులో మాంసం ఉందని తెలుసుకున్నానని చెప్పింది.

ఆ మహిళ చెప్పిన దాని ప్రకారం, ఆమె “లఖ్నవి కబాబ్ పరాఠా” అనే రెస్టారెంట్‌లో ఆర్డర్ చేసింది. మాంసం ముక్క గురించి ఆరా తీద్దామని ఫోన్‌ చేస్తే ఎవరూ సమాధానం ఇవ్వలేని చెప్పుకొచ్చింది.

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌ కావడంతో ఆ రెస్టారెంట్‌పై, స్విగ్గీ యాప్‌పై నెటిజన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళ నాన్-వెజ్ రెస్టారెంట్ నుండి ఫుడ్ ఆర్డర్ చేసినందుకు మరికొందరు నిందించారు. నవరాత్రి సమయంలో బయటి ఆహారం తినకూడదు, బలవంతంగా తినవలసి వస్తే, వెజ్ మోడ్ యాక్టివేట్ చేయాలి, రెండవది, పరాఠాతో లక్నోవి కబాబ్ ఆర్డర్ చేయాల్సిన అవసరం ఏమిటి? పండిట్ జీ పరాఠా నుండి ఆర్డర్ చేసి ఉండాల్సింది. రెస్టారెంట్ పై చర్య తీసుకోవాలి అని మరికొందరు నెటిజన్స్‌ పోస్టులు పెడుతున్నారు.

 

వీడియో చూడండి: