Video: ఏంట్రా ఇదీ.. బాల్కనీలో ఓపెన్ టాయిలెట్.. బెంగళూరు ఫ్లాట్ వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

ఇల్లు కట్టుకోవడానికి లేదా ఫ్లాట్ డిజైన్ చేయడానికి కొన్ని పద్ధతులు, ప్రైవసీ రూల్స్ ఉంటాయి. ముఖ్యంగా బాత్రూమ్ లేదా టాయిలెట్లను నాలుగు గోడల మధ్య గుప్తంగా నిర్మిస్తారు. కానీ బెంగళూరులోని ఒక ఫ్లాట్ ఓనర్ మాత్రం అందరి కంటే డిఫరెంట్‌గా ఆలోచించి.. ఎలాంటి కనెక్షన్, అడ్డుగోడలు లేకుండా నేరుగా బాల్కనీలోనే వెస్ట్రన్ కమోడ్‌ను పెట్టేశాడు.ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Video: ఏంట్రా ఇదీ.. బాల్కనీలో ఓపెన్ టాయిలెట్.. బెంగళూరు ఫ్లాట్ వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Flat With A Toilet In The Balcony Goes Viral

Updated on: Jun 21, 2026 | 9:19 PM

స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. విచిత్రమైన ప్రదేశాలు, వింత మనుషులు, ఊహించని సంఘటనలకు సంబంధించిన వీడియోలు నిత్యం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఐటీ హబ్ బెంగళూరులో వెలుగు చూసిన ఒక విచిత్రమైన ఫ్లాట్ డిజైన్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒక అపార్ట్‌మెంట్ ఫ్లాట్ బాల్కనీలో ఏకంగా టాయిలెట్ నిర్మించిన వైనం ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారింది.

ఇల్లు కట్టే రూల్స్ అన్నింటికీ చెక్..

సాధారణంగా ఒక ఇల్లు లేదా ఫ్లాట్ నిర్మించడానికి కొన్ని పద్ధతులు, నియమాలు ఉంటాయి. హాల్, బెడ్‌రూమ్స్, కిచెన్ ఎక్కడ ఉండాలి.. టాయిలెట్లను ఎక్కడ నిర్మించాలి అనే దానికి ఒక ప్లాన్ ఉంటుంది. ప్రైవసీ, సేఫ్టీ కోసం టాయిలెట్లను ఎప్పుడూ గదుల లోపల లేదా బెడ్‌రూమ్‌లకు సమీపంలో నాలుగు గోడల మధ్య క్లోజ్డ్ ఏరియాలో నిర్మిస్తారు. కానీ ఈ బెంగళూరు ఫ్లాట్ ఓనర్ మాత్రం ఇంజనీరింగ్ సూత్రాలన్నింటినీ పక్కన పడేసి ఎలాంటి కనెక్షన్ లేకుండా నేరుగా బాల్కనీలోనే ఓపెన్ టాయిలెట్‌ను పెట్టేశాడు.

నెటిజన్లకు షాకిస్తున్న ఆ వైరల్ వీడియో..

ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతున్న ఆ వీడియోలో.. ఒక యువతి ఫ్లాట్ లోపల నుండి బాల్కనీ తలుపు తెరిచి బయటకు వస్తుంది. అలా రాగానే ఆమెకు ఒక పెద్ద షాక్ తగులుతుంది. ఎందుకంటే.. అక్కడ బహిరంగంగా బాల్కనీ మూలన వెస్ట్రన్ టాయిలెట్ కమోడ్‌ను ఏర్పాటు చేసి ఉంచారు. కనీసం ఆ టాయిలెట్ చుట్టూ ఎలాంటి గోడలు గానీ, కప్పి ఉంచేలా ఎలాంటి ఏర్పాటు గానీ లేదు. కేవలం బాల్కనీకి చుట్టూ ఉండే ఒక తీగ కంచె మాత్రమే ఉంది. అంటే అక్కడ కూర్చుంటే రోడ్డుపై వెళ్లే వారందరికీ స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. ఈ బహిరంగ టాయిలెట్ డిజైన్ చూసి సదరు మహిళతో పాటు వీడియో చూస్తున్న నెటిజన్లు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.

సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం..

ఈ వీడియో ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అవుతుండటంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతూ ట్రోల్ చేస్తున్నారు. ‘‘బెంగళూరులో ఫ్లాట్ల రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో.. బాల్కనీని కూడా బాత్రూమ్‌గా మార్చేసి అదనపు అద్దె వసూలు చేయాలని చూస్తున్నట్లున్నారు’’ అని కొందరు సెటైర్లు వేస్తుంటే.. “ప్రకృతిని ఆస్వాదిస్తూ.. ప్రకృతి పిలుపు అందుకోవడానికి ఇదో
వింత డిజైన్’’ అంటూ మరికొందరు జోకులు పేలుస్తున్నారు. ఏదేమైనా ఈ విచిత్రమైన బాల్కనీ టాయిలెట్ వీడియో మాత్రం ప్రస్తుతం నెట్ ఇంట్లో తెగా వైరల్ అవుతోంది.

వీడియో చూడండి..

Follow Us