Viral Video: ఇలా తయారయ్యారెంట్రా..? ఎగిరితంతే.. మెట్రో రైలు బయటపడింది!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. మెట్రో రైలులో ప్రయాణిస్తున్న సమయంలో డోర్ దగ్గర నిల్చున్న ఓ యువతిని వెనుక నుంచి మరో మహిళ ఎగిరి తంతుంది. డోర్ తీసి ఉండటంతో ఆ యువతి మెట్రో రైలు నుంచి ఫ్లాట్ ఫాంపై పడిపోతుంది. ఇలా ఒక్కసారిగా జరిగిన సంఘటనతో ఆ యువతి కొంత ఆందోళనకు గురైనట్లు కనిపిస్తుంది.

Viral Video: ఇలా తయారయ్యారెంట్రా..? ఎగిరితంతే.. మెట్రో రైలు బయటపడింది!
Metro Train Two Woman

Updated on: Jan 18, 2026 | 10:54 AM

సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చాలా మంది కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. కొంత మంది చేసే వీడియోలు ఆకట్టుకుంటే.. మరికొందరు చేసే చర్యలు వారి ప్రాణాలతోపాటు ఇతరులకు కూడా ఇబ్బందికరంగా మారుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. మెట్రో రైలులో ప్రయాణిస్తున్న సమయంలో డోర్ దగ్గర నిల్చున్న ఓ యువతిని వెనుక నుంచి మరో మహిళ ఎగిరి తంతుంది. డోర్ తీసి ఉండటంతో ఆ యువతి మెట్రో రైలు నుంచి ఫ్లాట్ ఫాంపై పడిపోతుంది. ఇలా ఒక్కసారిగా జరిగిన సంఘటనతో ఆ యువతి కొంత ఆందోళనకు గురైనట్లు కనిపిస్తుంది. అయితే, ఇలాంటి ప్రమాకర విన్యాసాలు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చేయడం చాలా దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఆ వీడియోలో ప్లాట్‌ఫామ్‌పై పడిపోయిన యువతి నవ్వుతూ, లేచి మెట్రో కోచ్ లోపలికి తిరిగి నడుస్తున్నట్లు కూడా కనిపిస్తుంది. ఈ వీడియో ఉద్దేశపూర్వకంగా తయారు చేయబడిందని, పూర్తిగా స్క్రిప్ట్ చేయబడిందని తెలుస్తోంది. ఇద్దరు స్నేహితులు దీనిని ఒక జోక్, వినోదంగా చూస్తున్నారు. అయితే, ఇది జోక్ కాదు, నిర్లక్ష్యం, బాధ్యతారహితమైన ప్రవర్తన అని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఈ వీడియో కనిపించిన వెంటనే.. సోషల్ మీడియాలో తీవ్ర స్పందనలు వచ్చాయి. నేటి ప్రపంచంలో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చాలా మంది ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సెకన్ల వీడియో కోసం ప్రజలు రిస్క్‌లు తీసుకుంటున్నారు, ఇది తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది. ఈ వీడియో కంటెంట్‌ను సృష్టించడంలో బాధ్యత రాహిత్యం కనిపిస్తుందని అంటున్నారు.


వినోదం తప్పు కాదు.. కానీ వాటికి పరిమితులు ఉండాలి. బహిరంగ ప్రదేశాలలో, ముఖ్యంగా మెట్రో, రైల్వే స్టేషన్లు లేదా వీధులు వంటి ప్రాంతాలలో ఇటువంటి విన్యాసాలు ప్రమాదకరం. కొంచెం ఇంగితజ్ఞానం, జాగ్రత్త తీసుకోవడం వారితోపాటు ఇతరులకు మంచిది. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు, వ్యూస్ పెంచుకోవడం కోసం ఇలాంటి ప్రయోగాలు చేయొద్దని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. సరదాగా చేసే ఇలాంటి ప్రయత్నాలు.. ఏదైనా పొరపాటు జరిగితే ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.