Snake Trending Video: ప్రజంట్ సమ్మర్ సీజన్ నడుస్తోంది. ఎండ దంచేస్తుంది. ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. వేసవి తాపం నుంచి సేద తీరేందుకు చాలామంది స్విమ్మింగ్ ప్రిఫర్ చేస్తున్నారు. స్విమ్మింగ్ అనేది శరీరానికి మంచి వ్యాయామం. అంతేకాదు ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. సిటీల్లో ఉండేవాళ్లు స్విమ్మింగ్ పూల్స్‌కు వెళ్తుంటే.. గ్రామాల్లోని యువత.. చెరువులు, తూముల్లో ఈతకు వెళ్తున్నారు. అయితే ఇలా పల్లెటూర్లలో ఈతకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సేఫ్టీ మెజర్స్ సరిగ్గా ఉండవు. వాటర్ ప్రవాహం ఉన్నపళంగా పెరగొచ్చు. అంతేకాదు కొన్నిసార్లు.. పాములు, కీటకాలు కూడా కరిచే ప్రమాదం ఉంది. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి వెలుగులోకి వచ్చింది. కొంతమంది విదేశీయులు నది ప్రవాహంలో ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక పెద్ద పాము అక్కడికి ఈదుతూ ఎంట్రీ ఇచ్చింది. అదేంటో తెలియదు కానీ.. ఒక రాయుపై కూర్చున్న బాలుడి వైపు అది దూసుకొచ్చింది. పాము వెంటాడుతూనే ఉండడంతో బాలుడు హడావుడిగా ఒడ్డుకు వచ్చాడు. అయినప్పటికీ అది అతడినే అనుసరించింది. అనంతరం ఆ బాలుడు ఆ పామును వీడియో తీస్తూ.. అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు.
ఈ వీడియోను ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ‘వైల్డ్‌స్టిక్’ అనే పేజీ షేర్ చేసింది. దీనికి మిలియన్ల కొద్దీ వ్యూస్.. లక్షల్లో లైక్స్ వచ్చాయి. కొంతమంది నెటిజన్లు పాము వారి పెట్ అయి ఉండొచ్చని కామెంట్ చేస్తున్నారు. అందుకే అది పక్కనే ఈదుకుంటూ వస్తున్నా చాలామంది భయపడలేదని అని వ్యాఖ్యానిస్తున్నారు.
కింద వైరల్ వీడియో చూడండి:
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..