Viral Video: మొసళ్లకు కూడా చక్కిలిగింతలు.. సోషల్‌ మీడియాలో మొసలి నవ్వుతున్న వీడియో వైరల్‌

Viral Video: సోషల్ మీడియాలో వన్యప్రాణులకు సంబంధించిన ఆశ్చర్యకరమైన వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. పులులు, సింహాలు, పాము, మొసలికి సంబంధించిన..

Viral Video: మొసళ్లకు కూడా చక్కిలిగింతలు.. సోషల్‌ మీడియాలో మొసలి నవ్వుతున్న వీడియో వైరల్‌

Updated on: Feb 19, 2022 | 11:48 AM

Viral Video: సోషల్ మీడియాలో వన్యప్రాణులకు సంబంధించిన ఆశ్చర్యకరమైన వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. పులులు, సింహాలు, పాము, మొసలికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో ఎక్కువగా వైరల్ అవుతోంది. సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ అయిన కొన్ని నిమిషాల్లోనే లక్షలాది మంది చూస్తుంటారు. అంతేకాదు ఆ వీడియోకు నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తుంటారు. ఇక సోషల్‌ మీడియాలో ఓ మొసలి వీడియో (Crocodile Video) తెగ వైరల్‌ అవుతోంది. మొసలి నవ్వుతున్న వీడియో అందరికి ఆశ్చర్యపరుస్తోంది. ఓ జూలో కీపర్ మొసలి వీపుపై చేయి పెడితే తట్టుకోలేక టిక్‌లు కొట్టినట్లు దవడ విప్పడం ఈ వీడియోలో చూడవచ్చు.

సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఈ వీడియోలో, జూ కీపర్ ఈ మొసలి వెనుక భాగాన్ని బ్రష్ సహాయంతో శుభ్రం చేస్తున్నాడు. ఆ వ్యక్తి మొసలి వీపుపై బ్రష్‌ను రుద్దిన వెంటనే దవడ విప్పినట్లు ఈ వీడియోలో చూడవచ్చు. మొసలికి సంబంధించిన ఈ వీడియోను జూ కీపర్ జే బ్రూవర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా jayprehistoricpetsలో షేర్ చేశారు. కొన్ని గంటల క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పటి వరకు 2 లక్షల 48 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అదే సమయంలో చాలా మంది దీనిపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

జూ కీపర్‌కి సలహా ఇస్తూ ఒక వినియోగదారు రాశాడు. మొసటి ఇప్పుడు జాగ్రత్తగా పెరిగింది. అది మీకు హాని కలిగించవచ్చు. అదే సమయంలో, మరొక వినియోగదారు ఓహ్ మై గాడ్ ఈ మొసలి నిజంగా నవ్వుతోందా అని కామెంట్‌ చేశాడు. ఇది కాకుండా చాలా మంది ఇతర నెటిజన్లు ఆశ్చర్యంతో ఇలాగే వ్యాఖ్యానించారు. మొత్తమ్మీద ఈ మొసలి నవ్వు అందరిని నవ్విస్తోంది. దీనిని చూస్తే మొసలి నవ్వుతున్నట్టు అనిపిస్తుంది. మరి ఈ ఫన్నీ వీడియో మీరు చూడండి.

 

ఇవి కూడా చదవండి:

Viral Video: దున్నపోతుతో ఇట్లానే ఉంటుంది మరీ.. వైరల్ వీడియో..

Viral Video: నది ఒడ్డున సేద తీరుతున్న కొండ చిలువ.. కరకర నమిలి తినేసిన మొసలి.. వీడియో వైరల్

Loading...
Unable to load recommendations.
Follow Us