Viral Video: భూమ్మీద ఇంకా నూకలు ఉన్నట్టున్నయ్‌… ఢిల్లీ-జైపూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై బైకర్‌ ప్రమాదకర స్టంట్‌…

యువకులు సోషల్ మీడియాలో ఫేమస్‌ అయ్యేందుకు రకరకాలుగా ఫీట్లు వేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. బైక్‌లపై స్టంట్లతో తోటి వాహనదారును భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గురుగ్రామ్‌లో చోటు చేసుకున్న ఒక హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇందులో రద్దీగా ఉండే ఢిల్లీ-జైపూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఒక బైకర్ తన వాహనాన్ని...

Viral Video: భూమ్మీద ఇంకా నూకలు ఉన్నట్టున్నయ్‌...  ఢిల్లీ-జైపూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై బైకర్‌ ప్రమాదకర స్టంట్‌...
Byker Dangerous Stunt

Updated on: Apr 28, 2025 | 6:35 PM

యువకులు సోషల్ మీడియాలో ఫేమస్‌ అయ్యేందుకు రకరకాలుగా ఫీట్లు వేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. బైక్‌లపై స్టంట్లతో తోటి వాహనదారును భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గురుగ్రామ్‌లో చోటు చేసుకున్న ఒక హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇందులో రద్దీగా ఉండే ఢిల్లీ-జైపూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఒక బైకర్ తన వాహనాన్ని అత్యంత ప్రమాదకరంగా నడుపుతున్నట్లు వీడియోలో కనిపించింది. ఓ యువకుడు తన రన్నింగ్‌ బైక్‌పై నిలబడి, అకస్మాత్తుగా నడిరోడ్డుపై పడిపోయే వరకు ఈ వీడియోలో దృశ్యాలు కనిపిస్తాయి.

ఆ మార్గంలో కార్లు, బైక్‌లు ప్రయాణిస్తున్న సాధారణ వాహనాల కదలికను చిత్రీకరించేటప్పుడు యవకుడి స్టంట్‌ కూడా రికార్డ్‌ అయింది. బైక్‌పై యువకుడు కూర్చుని ప్రయాణించే బదులుగా బైక్‌పై నిలబడి గాలిలో తేలిపోతున్నట్లు కనిపిస్తుంటుంది. అతను మొదట తెల్లటి కారు పక్కన స్వారీ చేస్తూ, స్టంట్ చేస్తూ కనిపించాడు. ఆ దృశ్యం చాలా మందిని షాక్‌కు గురి చేసింది.

వీడియోలో, బైకర్ హైవేపై కదులుతున్నప్పుడు తన ద్విచక్ర వాహనంపై నిలబడి ఉన్నట్లు చూడవచ్చు. తన చేతులను పక్కకు చాచి బైక్ సీటుపై నిటారుగా నిలబడి, తన బైకింగ్ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ప్రయత్నించాడు. అయితే, అతని స్టంట్ బెడిసికొట్టింది. కారు అతన్ని ఓవర్ టేక్ చేసిన కొన్ని సెకన్లకే అతను బ్యాలెన్స్ కోల్పోయి రోడ్డుపై పడిపోయాడు. ఆ దృశ్యంలో అతను బైక్ పై నుంచి పడి రోడ్డుపై పల్టీలు కొట్టాడు. అదృష్టవశాత్తూ ఎదురుగా వస్తున్న వాహనాలు అతన్ని తాకుండా వెళ్లిపోయాయి. ఈ సంఘటన ఆదివారం జరిగింది.

బైకర్ ఎవరో ఇంకా తెలియదు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ వాహనదారుడిపై ఏదైనా చట్టపరమైన చర్యలు తీసుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. నెటిజన్లు ఈ ప్రమాదకరమైన చర్యను తీవ్రంగా విమర్శించారు. దీనిని “ఘోరమైన స్టంట్” అని అభివర్ణించారు. జీవితాన్ని పణంగా పెట్టడం మంచిది కాదంటూ నెటిజన్స్‌ హెచ్చరించారు. ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించినందుకు బైకర్‌ణు జైలులో పెట్టాలని మరికొందరు డిమాండ్‌ చేస్తున్నారు.

 

వీడియో చూడండి: