Viral Video: పెళ్లి కూతురు అందానికి పెళ్లి కొడుకు ఫిదా.. ఆ మాత్రం రియాక్షన్‌ ఉండాలిగా మరి..!

Viral Video: పెళ్లికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు వధూవరుల విందు వీడియోలు, మరి కొన్నిసార్లు వధువు లుక్స్‌,

Viral Video: పెళ్లి కూతురు అందానికి పెళ్లి కొడుకు ఫిదా.. ఆ మాత్రం రియాక్షన్‌ ఉండాలిగా మరి..!
Groom Shocking Reaction

Updated on: Mar 15, 2022 | 5:51 AM

Viral Video: పెళ్లికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు వధూవరుల విందు వీడియోలు, మరి కొన్నిసార్లు వధువు లుక్స్‌, ఇంకొన్ని సార్లు వరుడి లుక్స్‌, మండపంలో సరదా సంఘటనలు ఇలా చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఈ వీడియోలని నెటిజన్లు తెగ ఎంజాయ్‌ చేస్తారు. లైక్స్‌, కామెంట్స్‌తో హోరెత్తిస్తారు. తాజాగా ఓ పెళ్లికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో వరుడు తన వధువును చూస ఒక్కసారిగా షాక్‌ అవుతాడు. కొందరు వ్యక్తులు చాలా ఉద్వేగభరితంగా ఉంటారు. వారి భావోద్వేగాలను అదుపుచేసుకోలేరు. అదే అనుభవం ఇక్కడ పెళ్లి కొడుకుకి ఎదురైంది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తుంది. వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే మొదటగా అది రిసెప్షన్ వేడుక అని అర్థమవుతుంది. స్టేజ్‌పై వధూవరులిద్దరు కూర్చోడానికి రెండు కుర్చీలు కూడా ఉంటాయి.

అప్పుడే బాంకెట్ హాల్‌లోకి వధువు ప్రవేశిస్తుంది. ఆమె అందాన్ని చూసిన వరుడు మంత్ర ముగ్ధుడైపోతాడు. రెండు చేతులు చాచి అలాగే కిందపడిపోవడానికి ప్రయత్నిస్తాడు. పక్కన ఉన్న స్నేహితులు అతడిని పట్టుకోవడం మనం వీడియోలో గమనించవచ్చు. పెళ్లికొడుకు ఈ క్షణం కోసం ఎన్నిరోజులు వేచిచూసాడో దీనిని బట్టి అర్థమవుతుంది. ఎట్టకేలకు తన కల నెరవేరినట్లుగా భావించాడు. ఈ వీడియోను wedabout అనే ఖాతా ద్వారా Instagramలో షేర్‌ చేశారు. వార్త రాసే సమయానికి ఈ వీడియోని 73 వేల మందికి పైగా చూశారు. దీంతో పాటు ఈ వీడియోపై పలువురు ఫన్నీ కామెంట్స్ కూడా చేశారు. ఒక నెటిజన్‌ ఇలా రాశాడు ‘ వరుడి స్టైల్ చాలా అందంగా ఉంది ‘ మరొకరు ‘వరుడు ఈ క్షణం కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నట్లుంది’ ఇంకొక నెటిజన్ ‘పెళ్లి దుస్తులలో అమ్మాయిని చూసి షాక్ తిన్నాడు’ ఇది కాకుండా చాలా మంది నెటిజన్లు అతడికి పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.

Women Health: మహిళలు ఇవి చేస్తే గుండె జబ్బుల బారిన పడరు.. ఎందుకంటే..?

Women Health: 30 ఏళ్లు దాటిన మహిళలకు ఇవి తప్పనిసరి.. అప్పుడే ఈ రోగాలు దూరం..!

Minister Perni Nani Comments: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని ఫైర్..