
కాసేపు ఆగితే అటికెలో కూర కావాల్సిన చేప తన తెలివి తేటలతో వల నుంచి బయటపడింది. బ్రతకాలనే చిన్న ఆశ ఎంతటి అపాయం నుంచైనా బయటపడేందుకు మార్గం చూపుతుంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో. వలలో చిక్కుకున్న ఓ చేప వలనుంచి తప్పించుకొని మళ్లీ నదిలోకి వెళ్లిపోయిన ఘటన నెటిజన్లను ఆకట్టుకుంటోంది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన నెటిజన్లు చేసే ప్రయత్నం ఎప్పటికీ వృధా పోదంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఓ జాలరి నదిలో చేపలను పట్టి వలను గట్టుపైన పెట్టి ఎక్కడికో వెళ్లాడు. వలలో చాలా చేపలు ఉన్నాయి. నిస్సహాయ స్థితిలో పడి ఉన్నాయి ఆ చేపలు. వాటిలో ఓ చేప ఎలాగైనా వలనుంచి బయటపడాలనుకుంది. అంతే వెంటనే పైకి ఎగరడం మొదలు పెట్టింది. దాంతో మడతలుగా ఉన్న వల ఓపెన్ అయింది. దాంతో ఆ చేపలో కాన్ఫిడెన్స్ పెరిగింది. మరింత బలంగా పైకి ఎగిరింది. ఒక్క ఉదుటన వల ఓపెన్ అయి చేప బయటపడింది. చేప ఆనందానినికి అవధుల్లేవు. ఇంక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. అలా ఎగురుతూ ఎగురుతూ వెళ్లి నదిలో పడింది. మళ్లీ తన ప్రపంచంలోకి వచ్చేశాననే ఆనందంతో ఈదుకుంటూ లోపలికి వెళ్లిపోయింది.
మిగతా చేపలు నీటిలోనుంచి బయటకు వచ్చి అప్పటికి చాలా సేపవడంతో నీరసపడిపోయాయి. తమ మిత్రుడి ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ నిస్సహాయంగా ఉండిపోయాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ఈ వీడియోను ఇప్పటికే మూడున్నర మిలియన్లమంది వీక్షించారు. దాదాపు లక్షమంది లైక్ చేశారు.