Viral Video: ఫుల్లుగా తాగి డ్రైవింగ్‌ సీటులో తందనాలు ఆడితే… కళ్లు మూసి తెరిసే లోపే అంతా అయిపోయింది

స్పీడ్‌ కిల్స్‌.. బట్‌ కిల్స్‌, మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టరీత్యా నేరం అని ట్రాఫిక్‌ పోలీసులు తాటికాయంత అక్షరాలతో పెట్టే హెచ్చరికల బోర్డులను కొంత మంది లెక్క చేయడం లేదు. ఫలితంగా రోడ్డు ప్రమాదాల భారిన పడి తమ ప్రాణాలు తీసుకోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలను సైతం...

Viral Video: ఫుల్లుగా తాగి డ్రైవింగ్‌ సీటులో తందనాలు ఆడితే... కళ్లు మూసి తెరిసే లోపే అంతా అయిపోయింది
Scorpio Drunken Drive Accid

Updated on: Jun 17, 2025 | 4:24 PM

స్పీడ్‌ కిల్స్‌.. బట్‌ కిల్స్‌, మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టరీత్యా నేరం అని ట్రాఫిక్‌ పోలీసులు తాటికాయంత అక్షరాలతో పెట్టే హెచ్చరికల బోర్డులను కొంత మంది లెక్క చేయడం లేదు. ఫలితంగా రోడ్డు ప్రమాదాల భారిన పడి తమ ప్రాణాలు తీసుకోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలను సైతం తీసేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు రోజు ఎక్కడో ఒక చోట జురుగుతూనే ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేయడంతో మహీంద్రా స్కార్పియో వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురయింది.

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో జరిగింది ఈ సంఘటన. స్కార్పియో వాహనం అదుపుతప్పి నిర్మాణంలో ఉన్న గోడను భలంగా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా ఆ పక్కనే ఆగి ఉన్న ఆటోపైకి దూసుకెళ్లింది. దీంతో ఆటో పూర్తిగా ధ్వంసమైంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదివారం అచల్‌పూర్ గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ప్రమాద స్థలానికి గ్రామస్తులంతా తరలి వచ్చారు. వాహనంలో ఉన్న డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి ఉన్నట్లు గ్రామస్తులు ఆరోపించారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్కార్పియో, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

వీడియో చూడండి: