Viral Video: వామ్మో.. చిన్నారిని వేటాడేందుకు వచ్చిన చిరుత.. ఆ క్షణంలో ఏం జరిగిందంటే.. వీడియో

Cheetah tries to prey baby: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్ని వీడియోలు సరదాగా ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి.

Viral Video: వామ్మో.. చిన్నారిని వేటాడేందుకు వచ్చిన చిరుత.. ఆ క్షణంలో ఏం జరిగిందంటే.. వీడియో
Viral Video

Updated on: Feb 20, 2022 | 9:11 AM

Cheetah tries to prey baby: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్ని వీడియోలు సరదాగా ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. వాస్తవానికి జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతాయి. కొన్ని క్యూట్‌‌గా, మరికొన్ని భయంకరంగా ఉంటాయి. ఇటీవల కాలంలో ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియా (social media) లో చర్చనీయాంశంగా మారింది. ఇది చూస్తే.. మీరు కూడా ఒక క్షణం భయాందోళనకు గురవుతారు. ఎందుకంటే ఈ వీడియో అంత భయంకరంగా ఉంది. ఓ చిరుత పిల్లవాడిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. వీడియో (Viral Video) చూసి చాలా మంది భయాందోళనకు గురయ్యారు.

ఈ ఘటన UKలోని వోర్సెస్టర్‌షైర్‌లో జరిగింది. బెవ్డ్లీలోని వెస్ట్ మిడ్‌లాండ్స్ సఫారీ పార్క్‌లోని ‘చీతా సఫారీ లాడ్జ్’లో రికార్డయిన ఈ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది. ఇంగ్లిష్ వెబ్‌సైట్ ‘డైలీ మెయిల్’లో వచ్చిన కథనం ప్రకారం.. ఒట్టో (చిన్నారి) తండ్రి బెన్ మిల్లర్ కెమెరాలో ఈ దృశ్యాన్ని బంధించాడు. వైరల్ అవుతున్న వీడియోలో.. సఫారీ లాడ్జ్‌లోని ఒక గదిలో ఒక పిల్లవాడు నేలపై పాకుతుండటాన్ని మీరు చూడవచ్చు. అయితే కొన్ని సెకన్ల తరువాత బయటవైపుకు కదులుతున్నట్లు కనిపిస్తాడు. ఈ క్రమంలో చిరుత పులి పిల్లవాడిని వేటాడేందుకు ప్రయత్నించింది. కానీ పిల్లవాడికి.. పులికి మధ్య గాజు గోడ అడ్డంగా ఉంది.

వీడియో చూడండి

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను చూసి.. నెటిజన్లు షాకవుతున్నారు. దీంతోపాటు పలురకాల కామెంట్లు చేస్తున్నారు. ‘పొరపాటున గాజు పగిలిపోతే కచ్చితంగా ఆ చిన్నారి బతకడం కష్టమే’ అని ఓ యూజర్ రాయగా.. చిరుత ఎత్తులు ఫలించలేదు అంటూ మరో యూజర్ పేర్కొన్నాడు. చాలామంది వీడియో భయంకరంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Viral Video: ఆ బాలుడు అలవోకగా ట్రాక్టర్‌ ఎత్తేశాడు.. వీడియో చూస్తే నమ్మలేకపోతారు..?

Kacha Badam Song: భారతీయుల పాటకు విదేశీయులు ఫిదా.. కచా బాదం సాంగ్‌కు చెల్లెలుతో కలిసి డ్యాన్స్ చేసిన కిలీ