Viral Video: స్కూటీకి బైక్ తగలింది అంతే.. రోడ్డుపై రచ్చరచ్చ చేసిన యువతి.. సెల్‌ఫోన్‌ లాక్కొని నేలకేసి కొట్టింది..!

Viral Video: ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా నుంచి షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఓ అమ్మాయికి సంబంధించినది. రోడ్డుపై హై వోల్టేజ్ డ్రామా సృష్టిస్తుంది. ఇ

Viral Video: స్కూటీకి బైక్ తగలింది అంతే.. రోడ్డుపై రచ్చరచ్చ చేసిన యువతి.. సెల్‌ఫోన్‌ లాక్కొని నేలకేసి కొట్టింది..!
Girl Snatched Phone

Updated on: Mar 07, 2022 | 10:48 AM

Viral Video: ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా నుంచి షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఓ అమ్మాయికి సంబంధించినది. రోడ్డుపై హై వోల్టేజ్ డ్రామా సృష్టిస్తుంది. ఇప్పుడు ఘటనకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ప్రకారం.. ఇటావాలో ఒక అమ్మాయి తన స్కూటీపై ఎక్కడికో వెళుతుంటుంది. అదే సమయంలో అటుగా వస్తున్న ఓ అబ్బాయి బైక్‌ అనుకోకుండా అమ్మాయి స్కూటీని తాకుతుంది. అంతే వెంటనే యువతి ఆగ్రహంతో యువకుడి మొబైల్ లాక్కొని నేలకేసి కొడుతుంది. ఈ సమయంలో ఎవరో ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సంఘటన గురించి యువకుడిని అడగ్గా.. తాను బైక్‌తో స్కూటీని తాకినందుకు ఆ అమ్మాయికి క్షమాపణలు చెప్పానని అయినా కూడా ఆమె తన సెల్‌ఫోన్‌ని పగలకొట్టిందని చెప్పాడు. ఈ ఘటన ఇటావాలోని పోలీస్ స్టేషన్ పరిధిలోని పక్కా చెరువులో జరిగింది.

మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. మంగళ్ అనే యువకుడు బైక్ పై పక్కా చెరువు వైపు వెళ్తున్నాడు. ఈ సమయంలో ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ యువతి స్కూటీకి తగిలాడు. దీంతో ఆ బాలిక తీవ్ర ఆగ్రహానికి గురై స్కూటీని ఆపి యువకుడి వద్దకు వస్తుంది. రోడ్డుపై యువకుడిని నానా మాటలు అంటుంది. అనంతరం కోపం చల్లారక అతడి మొబైల్‌ తీసి నేలకేసి కొట్టింది. కొడుతుంది. మొబైల్‌ పగిలిపోవడం మనం వీడియోలో గమనించవచ్చు. రోడ్డుపై చాలామంది జనం గుమిగూడినా దీని గురించి ఎవ్వరూ మాట్లాడకపోవడం గమనార్హం. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. మీరు కూడా ఈ వీడియోని చూస్తే మీ కామెంట్ తెలియజేయండి.

Viral Video: గడ్డకట్టే నదిలో చిక్కుకున్న కుక్క.. ప్రాణాలు పోయేముందు కాపాడిన పోలీసులు.. వైరల్‌ వీడియో..

Aloe Vera: ఆ సమస్యతో బాధపడితే కలబంద వాడండి.. తక్షణమే ఉపశమనం..

Maruti Suzuki: మారుతి సుజుకి బంపర్ ఆఫర్.. వ్యాగనర్ నుంచి ఆల్టో వరకు రూ.40,000 తగ్గింపు..