Viral Video: పెద్దపులికే ఝలక్‌ ఇచ్చిన ఎలుగుబంటి… వీడియో చూసి నెటిజన్స్‌ ఫిదా!

ఎలుగుబంటి పులినే పరుగులు పెట్టించింది. చూడ్డానికి హాస్యాస్పదంగా ఉన్న ఈ వీడియో మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలోని పెంచ్ టైగర్ రిజర్క్‌లో చోటుచేసుకుంది. వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్స్‌ ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు. వీడియోలో ఒక పెద్ద నల్ల ఎలుగుబంటి గర్జించే పులిని భయపెడుతోంది. ఎలుగుబంటి ధైర్యానికి...

Viral Video: పెద్దపులికే ఝలక్‌ ఇచ్చిన ఎలుగుబంటి... వీడియో చూసి నెటిజన్స్‌ ఫిదా!
Deer Brave

Updated on: Apr 28, 2025 | 9:17 PM

ఎలుగుబంటి పులినే పరుగులు పెట్టించింది. చూడ్డానికి హాస్యాస్పదంగా ఉన్న ఈ వీడియో మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలోని పెంచ్ టైగర్ రిజర్క్‌లో చోటుచేసుకుంది. వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్స్‌ ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు.

వీడియోలో ఒక పెద్ద నల్ల ఎలుగుబంటి గర్జించే పులిని భయపెడుతోంది. ఎలుగుబంటి ధైర్యానికి, పోరాట స్ఫూర్తికి నెటిజన్ల నుండి ప్రశంసలు ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ వీడియోలో, ఒక ఎలుగుబంటి నిర్భయంగా పులిని ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తుంది. ఇది పెద్ద పిల్లిని వెనక్కి నెట్టి చివరికి పారిపోయేలా చేస్తుంది. సాధారణంగా, అడవిలో పులులను సింహాల తర్వాత రెండవ స్థానంలో పరిగణిస్తారు. అలాంటిది పులినే ఎలుగుబంటి పరుగులు పెట్టిండం చూసి నెటిజన్స్‌ ఆశ్చర్యపోతున్నారు.

ఎలుగుబంటి ఒక చెరువు దగ్గర నిలబడి ఉన్నప్పుడు ఒక పులి అక్కడికి వచ్చింది. ఎలుగుబంటి దగ్గరికి పులి రావడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో ఎలుగుబంటి భయపడకుండా పులి ముందు ధైర్యంగా నిలబడింది. పులి మరింత దగ్గరికి రాబోతుండగా ఎలుగుబంటి రెండు సార్లు బలంగా తన శరీరాన్ని కదిలించింది. దీంతో పులి భయపడుతున్నట్లు కనిపించింది. అప్పుడు ఎలుగుబంటి మరింత బిగ్గరగా గర్జిస్తుంది. ఇది చూసిన పులి నెమ్మదిగా వెనక్కి తగ్గి చివరికి అక్కడి నుంచి పారిపోతుంది. ఈ వీడియో పట్ల నెటిజన్స్‌ ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు.

ఎలుగుబంటి దూకుడు, దాని ఆత్మవిశ్వాసమే దానికి గొప్ప ఆయుధాలుగా మారాయని పోస్టులు పెడుతున్నారు. ఎలుగుబంటి ధైర్యం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తుందని కామెంట్స్‌ చేస్తున్నారు.

వీడియో చూడండి: